For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England తొలి టీ20.. సౌథాంప్టన్‌ వాతావరణ పరిస్థితి ఏంటంటే?

India vs England 1st T20 Weather Report: Will Rain Spoil The T20 Match At Southampton

సౌథాంప్టన్: ఇంగ్లండ్ రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్‌లో ఊరించి ఊసురుమనిపించిన టీమిండియా ధనాధన్ సమరానికి సిద్దమైంది. మూడు మ్యాచ్‌లో భాగంగా గురువారం జరిగే తొలి టీ20లో టీమిండియా.. ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్‌కు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ప్రయోగాలను పక్కన పెట్టి మెగా టోర్నీకి అత్యుత్తమ ఎలెవన్‌ను గుర్తించడమే లక్ష్యంగా టీమిండియా సమరానికి సన్నద్ధమైంది. జట్టు నిండా హిట్టర్లతో బాదుడును మరో స్థాయికి తీసుకెళ్లిన ఇంగ్లండ్‌ను నిలువరించడం సవాలే. ఈ సిరీస్‌తో జోస్‌ బట్లర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ మొదలు కానుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వర్ష గండం..?

వర్ష గండం..?

అయితే ఇంగ్లండ్ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్‌లోనూ వరుణుడు వరుసగా మూడు రోజుల పాటు ఆటంకం కలిగించాడు. ఈ క్రమంలో గురువారం భారత కాలమాన ప్రకారం రాత్రి 10.30కు ప్రారంభమయ్యే మ్యాచ్‌ వర్షం అంతరాయం ఉందా? అనే ఆందోళనలో భారత అభిమానులు ఉన్నారు. మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేదా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సౌథాంప్టన్ వాతావరణ శాఖ వివరాల ప్రకారం అక్కడ ఈ రోజు వర్ష సూచనలేదు. వాతావరణం పొడిగా ఉండనుంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 23 డిగ్రీలు, కనిష్టంగా 17 డిగ్రీలు నమోదు కానున్నాయి.

పిచ్ రిపోర్ట్..

పిచ్ రిపోర్ట్..

సౌథాంప్టన్‌ పిచ్‌పై కాస్త పచ్చిక ఉంది. బౌండరీ చాలా దూరంగా ఉంటుంది. ఈ సీజన్‌ టీ20 బ్లాస్ట్‌ టోర్నీలో ఇక్కడ మరీ పరుగులేమీ రాలేదు. తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 165. ఏడు మ్యాచ్‌ల్లో అయిదుసార్లు మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకునేందుకే మొగ్గు చూపుతాయి.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

కరోనా కారణంగా టెస్టు మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టులోకి వచ్చాడు. కోహ్లి, బుమ్రా, జడేజా, శ్రేయస్‌ అయ్యర్‌, పంత్‌ మాత్రం రెండో టీ20 నుంచి ఆడతారు. ఇషాన్‌ కిషన్‌తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు. ఇక అరంగేట్రం చేయని ఆటగాళ్లు రాహుల్‌ త్రిపాఠి, అర్ష్‌దీప్‌ సింగ్‌లు రెండు, మూడో టీ20లకు జట్టులో లేరు. ఈ మ్యాచ్‌కు ఉన్నా.. తుది జట్టులో స్థానం లభించే అవకాశం కనిపించట్లేదు. మిడిల్‌ ఆర్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ తనదైన శైలిలో చెలరేగాలని జట్టు ఆశిస్తోంది.

బలమైన ఇంగ్లాండ్‌పై పైచేయి సాధించాలంటే ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ మెరవాల్సిన అవసరముంది. వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఫినిషర్‌గా తన బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తాడో చూడాలి. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌లపై చాలా భారం ఉంది. మూడో పేసర్‌ స్థానంలో కోసం ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ మధ్య పోటీ ఉంది. చాహల్‌, అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ బాధ్యతలను పంచుకుంటారు.

ఉత్సాహంగా ఇంగ్లండ్‌

ఉత్సాహంగా ఇంగ్లండ్‌

ఆతిథ్య జట్టు ఉత్సాహంగా సమరానికి సిద్ధమైంది. మోర్గాన్‌ రిటైరైన నేపథ్యంలో ఈ సిరీస్‌తో ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌ శకం మొదలు కానుంది. బెన్‌ స్టోక్స్‌, బెయిర్‌స్టోలకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు. అయినా ఆ జట్టులో హిట్టర్లకు కొదువలేదు. బట్లర్‌, లివింగ్‌స్టోన్‌ ఐపీఎల్‌లో చెలరేగిన సంగతి తెలిసిందే. వాళ్లు ఈ సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటున్నారు. వారిని నిలువరించడం భారత బౌలర్లకు పెను సవాలే.

Story first published: Thursday, July 7, 2022, 12:04 [IST]
Other articles published on Jul 7, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+