
వర్ష గండం ఉందా?
అయితే ఇంగ్లండ్‌లో వాతావరణం ఎప్పుడూ ఎలా ఉంటుందో చెప్పలేం. రిషెడ్యూల్ టెస్ట్‌కు వరుసగా మూడు రోజులు అంతరాయం కలిగించిన వరుణుడు ఆ తర్వాత ఇబ్బంది పెట్టలేదు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సజావుగా సాగింది. అయితే తొలి వన్డేకు కూడా వర్ష సూచన లేదని లండన్ వాతావరణ శాఖ పేర్కొంది. లండన్‌లోని ది ఓవల్ మైదానం వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా.. అక్కడ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదుకానున్నాయి. గరిష్టంగా 30 డిగ్రీలు.. కనిష్టంగా 25 డిగ్రిల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. రోజు మొత్తంలో ఏ సమయంలో కూడా వర్షం పడే ఆస్కారం లేదు.

పిచ్ రిపోర్ట్..
మ్యాచ్ వేదిక ఓవల్‌లో పిచ్ సాధారణంగా నిర్జీవంగా ఉంటుంది. బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఆరంభంలో పిచ్ నుంచి పేసర్లకు కాస్త సహకారం లభించవచ్చు. టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్‌కు మొగ్గు చూపొచ్చు.

కోహ్లీకి గాయం..
ఫామ్‌లో లేని విరాట్ కోహ్లి గజ్జల్లో గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అతడి గాయం తీవ్రత ఎంతో ఇంకా తెలియలేదు. ''మూడో టీ20 సందర్భంగా విరాట్‌కు గజ్జల్లో గాయమైంది. విశ్రాంతి అవసరమైన నేపఫథ్యంలో అతడు తొలి వన్డేలో ఆడలేకపోవచ్చు'' అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ఇటీవల వరుస వైఫల్యాలతో కోహ్లి విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కపిల్ దేవ్, సెహ్వాగ్ వంటి మాజీ ఆటగాళ్లు టీ20 జట్టులో అతడి స్థానాన్ని ప్రశ్నించారు. కోహ్లీ దూరమైతే అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు.

భారత్‌దే పైచేయి..
వన్డే క్రికెట్లో ఇంగ్లండ్తో ముఖాముఖిలో భారత్‌దే కాస్త పైచేయి. ఇప్పటివరకు రెండు జట్లు 103 మ్యాచ్‌ల్లో తలపడగా భారత్ 55 విజయాలు సాధించింది. ఇంగ్లండ్ 43 మ్యాచ్‌ల్లో నెగ్గింది. రెండు టైగా ముగిశాయి. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. తొలి వన్డేకు వేదికైన ఓవల్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ 8 వన్డేలాడాయి. టీమ్‌ఇండియా రెండు మ్యాచ్‌లే నెగ్గగా.. ఆతిథ్య జట్టు 5 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు

తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ/శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ప్రసిధ్‌కృష్ణ, యుజ్వేంద్ర చహల్.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, సాల్ట్, బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, విల్లే, కార్స్, రీస్ టోప్లే, సామ్ కరన్.


Click it and Unblock the Notifications












