India vs Engaland: ప్చ్.. భారత్ ఘోర పరాజయం!

చెన్నై: అన్ని ఫార్మాట్లలో తిరుగులేని రికార్డున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టెస్ట్ బ్యాటింగ్‌కు పర్యాయపదం లాంటి నయావాల్ చతేశ్వర్ పుజారా.. టాపార్డర్‌లో టాలెంటెడ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ.. మిడిలార్డర్‌లో మంచి అనుభవం, నైపుణ్యం ఉన్న రహానే, రిషభ్ పంత్, సుందర్, అశ్విన్ అండ.. కానీ ఏం లాభం అంతా కలిసి బ్యాట్లేత్తేశారు. ఫలితంగా 22 ఏళ్ల తర్వాత చెన్నై చెపాక్ స్టేడియంలో భారత్ ఓటమిపాలైంది.
చేతిలో 9 వికెట్లు.. ఆస్ట్రేలియాపై సాధించిన విజయ ఉత్సాహం.. గెలవకపోయినా కనీసం డ్రాతోనైనా గట్టెక్కుతుందని ఆఖరి రోజు ఆటకు ముందు భారత అభిమానులు లెక్కలేసుకున్నారు. కానీ బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌లో జేమ్స్ అండర్సన్(3/17), జాక్ లీచ్(4/76) చెలరేగడంతో అంతా అతలాకుతలమైంది.
39/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో మంగళవారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్.. 58.1 ఓవర్‌లో 192 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్ 227 పరుగుల భారీ తేడాతో ఘనవిజయాన్ని సాధించి నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో లీడ్‌లో నిలిచింది. ఇక భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్(50), విరాట్ కోహ్లీ(72) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ మూడు, జాక్ లీచ్ నాలుగు వికెట్లు తీయగా.. ఆర్చర్, డామ్ బెస్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీశారు.

శుభ్‌మన్ హాఫ్ సెంచరీ..
381 పరుగుల వెనుకంజలో మంగళవారం ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆదిలోనే నయావాల్ చతేశ్వర్ పుజారా(38 బంతుల్లో 15) వికెట్‌ను చేజార్చుకుంది. జాక్ లీచ్ వేసిన షార్ప్ బౌన్స్ పుజారా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకండ్ స్లిప్‌లో ఉన్న బెన్ స్టోక్స్ చేతిలో పడింది. క్రీజులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ రాగా.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ధాటిగా ఆడాడు. ప్రారంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై బౌండరీలతోనే విరుచుకుపడిన శుభ్‌మన్ లీచ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

దెబ్బతీసిన అండర్సన్..
శుభ్‌మన్ హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే అండర్సన్‌ను బౌలింగ్‌కు దించిన జోరూట్ ఫలితాన్ని రాబట్టాడు. అండర్సన్ వేసిన ఒకే ఓవర్‌లో శుభ్‌మన్ గిల్(50), అజింక్యా రహానే(0) పెవిలియన్ బాట పట్టారు. ముందుగా మంచి ఇన్‌స్వింగర్‌తో శుభ్‌మన్ గిల్ ఆఫ్‌స్టంప్‌ను ఎగరగొట్టిన అండర్సన్.. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన రహానేను వికెట్ల ముందు బోల్తా కొట్టించే ప్రయత్నం చేశాడు. కానీ అంపైర్లు నాటౌట్ ఇవ్వడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు రివ్యూకు వెళ్లారు. బాల్ ట్రాకర్‌లో బంతి ఆఫ్ స్టంప్‌ను హిట్ చేయడంతో అంపైర్స్ కాల్‌తో రహానే బతికిపోయాడు. కానీ అండర్సన్ మరుసటి బంతికే రహానేను శుభ్‌మన్ తరహాలోనే బౌల్డ్ చేశాడు.

పంత్, సుంధర్ విఫలం..
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(11), సుందర్(0) తీవ్రంగా నిరాశపరిచారు. పంత్ అండర్సన్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఔటవ్వగా.. డామ్ బెస్ బౌలింగ్‌లో సుందర్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన అశ్విన్‌తో విరాట్ కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో భారత్ 144/4 లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. లంచ్ అనంతరం విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. కొద్ది సేపటికే లీచ్ బౌలింగ్‌లో అశ్విన్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే విరాట్‌ను స్టోక్స్ బౌల్డ్ చేయడంతో భారత్ ఓటమి ఖాయమైంది. చివర్లో నదీమ్‌ను లీచ్.. బుమ్రాను ఆర్చర్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications