ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్దమైంది. 45 రోజు సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా ఈ సిరీస్‌తోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతుంది. చెన్నై వేదికగా గురువారం నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించిన ఆటగాళ్లు.. మైదానంలోకి బరిలోకి దిగేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఈ సిరీస్‌తో కలిపి వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ను గెలిచి తమ టెస్ట్ సీజన్‌ను ఘనంగా ప్రారంభిస్తామని రోహిత్ శర్మ మీడియా సమావేశంలో వెల్లడించాడు. బంగ్లాదేశ్‌ను ఏ మాత్రం తేలికగా తీసుకోమని చెప్పాడు. డబ్ల్యూటీసీ 2025లో భాగంగా జరిగే ఈ సిరీస్ గెలవడం తమకు చాలా ముఖ్యమని తెలిపాడు.

భారత్‌ను ఓడిస్తామని బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలపై స్పందించమని, ఆటతోనే బదులిస్తామని స్పష్టం చేశాడు. ప్రతీ జట్టుకు భారత్‌ను ఓడించాలనుకుంటుందని, గతంలో ఇంగ్లండ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిందని గుర్తు చేశాడు. ఈ సవాళ్ల గురించి ఆలోచించకుండా మెరుగైన క్రికెట్ ఆడేందుకు ప్రయతిస్తామని తెలిపాడు.
భారత్ బంగ్లాదేశ్ సిరీస్ షెడ్యూల్..
తొలి టెస్ట్: సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు చెన్నై వేదికగా ఉదయం 9.30 గంటలకు ప్రారంభం
రెండో టెస్ట్: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు కాన్పూర్ వేదికగా ఉదయం 9.30 గంటలకు ప్రారంభం
ఫ్రీగా చూడాలంటే..?
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు రిలయన్స్ సంస్థకు చెందిన జియోసినిమా, స్పోర్ట్స్ 18 అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి. స్పోర్ట్స్ 18 సాటిలైట్ ఛానెల్‌లో ఈ సిరీస్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. అయితే ఈ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియోసినిమాలో మాత్రం ఫ్రీగా ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు.
జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్(కీపర్), ధ్రువ్ జురెల్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ షాంటో(కెప్టెన్), మహ్ముదుల్ హసన్ జాయ్, జకీర్ హసన్, షెడ్‌మన్ ఇస్లామ్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, మెహ్‌దీ హసన్ మీరాజ్, తైజుల్ ఇస్లామ్, నయీమ్ హసన్, నహిద్ రాణా, హసన్ మహ్ముద్, టస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలెద్ అహ్మద్, జాకెర్ అలీ అనిక్