బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా.. మరో మ్యాచ్‌కు సిద్దమైంది. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే భారత ఆటగాళ్లు కాన్పూర్ చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. చెన్నై టెస్ట్‌లో 280 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. అదే జోరును రెండో టెస్ట్‌లో కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది.
టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే బంగ్లాదేశ్‌తో టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 6 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యంగ్ ఇండియా ఈ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన భారత జట్టును ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. టెస్ట్ సిరీస్ ఆడిన ఆటగాళ్లంతా ఈ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

న్యూజిలాండ్‌తో పాటు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లు ఉన్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ప్రధాన ఆటగాళ్లంతా దూరం కానున్నారు. గ్వాలియన్ వేదికగా అక్టోబర్ 6న తొలి టీ20 జరగనుండగా.. ఢిల్లీ వేదికగా అక్టోబర్ 9న రెండో టీ20, అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా మూడో టీ20 జరగనుంది.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 సిరీస్ షెడ్యూల్..
తొలి టీ20: అక్టోబర్ 6(ఆదివారం), గ్వాలియర్ వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం
రెండో టీ20: అక్టోబర్ 9న(బుధవారం) ఢిల్లీ వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం
ఫ్రీగా చూడాలంటే..?
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండు టీ20 సిరీస్‌కు రిలయన్స్ సంస్థకు చెందిన జియోసినిమా, స్పోర్ట్స్ 18 అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి. స్పోర్ట్స్ 18 సాటిలైట్ ఛానెల్‌లో ఈ సిరీస్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. అయితే ఈ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియోసినిమాలో మాత్రం ఫ్రీగా ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు.