Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Bangladesh మ్యాచ్.. మెరిసిన సారా టెండూల్కర్.. ఫొటోలు వైరల్!

పుణె: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ హాజరైంది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు సారా టెండూల్కర్ తన స్నేహితులతో కలిసి వచ్చింది. స్టాండ్స్‌ నుంచి సారా టెండూల్కర్ ఈ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ టీమిండియాకు మద్దతు తెలుపుతోంది.

ఈ మ్యాచ్‌కు హాజరైన సారా టెండూల్కర్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌కు సారా హాజరవ్వడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కోసమే సారా టెండూల్కర్ ఈ మ్యాచ్‌కు వచ్చిందని ఆరోపిస్తున్నారు. గతేడాది క్రితం వరకు సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది.

India vs Bangladesh: Sara Tendulkar cheers Team India in Pune, Pics goes viral

శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చినప్పుడల్లా సారా టెండూల్కర్ పేరు సోషల్ మీడియాలో మారుమోగేది. సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవ్వడం..తమ ఫొటోలకు కామెంట్ చేసుకోవడంతో ఈ ఇద్దరి ప్రేమయాణానికి సంబంధించిన వార్తలకు బలం చేకూరింది. అయితే ఈ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు కొత్త ప్రచారం తెరిపైకి వచ్చింది.

ఈ ఇద్దరూ కలిసి ఓ కాఫీ షాప్‌లో కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. దాంతో సారా టెండూల్కర్-శుభ్‌మన్ గిల్ లవ్‌కు సంబంధించిన గాసిప్స్‌కు బ్రేక్ పడింది. తాజాగా సారా టెండూల్కర్.. టీమిండియా మ్యాచ్‌కు హాజరవ్వడంతో శుభ్‌మన్ గిల్ కోసమే వచ్చిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తన్జిద్ హసన్(43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51), లిటన్ దాస్(82 బంతుల్లో 7 ఫోర్లతో 66) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించినా.. క్రీజులో సెట్ అయిన తర్వాత చెలరేగారు.

తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించిన అనంతరం తన్జిద్ హసన్‌ను కుల్దీప్ యాదవ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చగా.. నజ్ముల్ హోస్సెన్ షాంటో(8)ను జడేజా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే రాహుల్ సూపర్ క్యాచ్‌కు మెహ్‌దీ హసన్(3) వెనుదిరగ్గా.. ధాటిగా ఆడుతున్న లిటన్ దాస్‌ను జడేజా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే టౌహిడ్ హృదయ్(16)ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ 179 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది.

క్రీజులోకి వచ్చిన మహ్మదుల్లా(13 బ్యాటింగ్)తో ముష్ఫికర్ రహీమ్(37 బ్యాటింగ్) నిలకడగా ఆడుతున్నాడు.

Story first published: Thursday, October 19, 2023, 17:33 [IST]
Other articles published on Oct 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+