India vs Bangladesh: రోహిత్ సేనకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో మరో ప్లేయర్ సిరీస్‌కు దూరం!

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా దెబ్బ మీద దెబ్బ పడింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. మూడు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందే స్టార్ పేసర్ మహమ్మద్ షమీ భుజ గాయంతో తప్పుకోగా.. తొలి వన్డే ప్రారంభానికి ముందు స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయంతో ఇబ్బంది పడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తొలి వన్డేకు అందుబాటులో లేకుండా పోయాడు. రిషభ్ పంత్, అక్షర్ పటేల్ ప్రాక్టీస్‌లో గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. అక్షర్ పటేల్ గాయం చిన్నదే అయినా.. పంత్ గాయం తీవ్రత కారణంగా సిరీస్ మొత్తానికి దూరం పెట్టాల్సి వచ్చింది.
మెడికల్ టీమ్ సూచనలతో..
తొలి వన్డే ప్రారంభమైన అనంతరం ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ మెడికల్ సూచనల మేరకే రిషభ్ పంత్‌ను వన్డే సిరీస్ నుంచి తప్పించామని ట్వీట్ చేసింది. 'బీసీసీఐ మెడికల్ టీమ్ సూచనలతో రిషభ్ పంత్‌ను వన్డే జట్టు నుంచి తప్పించాం. అతను మళ్లీ టెస్ట్ సిరీస్ సందర్భంగా జట్టుతో కలుస్తాడు. పంత్‌కు రిప్లేస్‌మెంట్ ఎవర్నీ ప్రకటించడం లేదు. అక్షర్ పటేల్ కూడా తొలి వన్డే సెలెక్షన్‌కు అందుబాటులో లేడు.'అని బీసీసీఐ ట్వీట్ చేసింది. అయితే పంత్‌కు వచ్చిన సమస్య ఏంటో బీసీసీఐ వెల్లడించలేదు. గాయమైందా? లేక మానసిక సమస్యలతో పక్కనపెట్టారా? అనే దానిపై క్లారిటీ లేదు.
మళ్లీ వికెట్ కీపర్‌గా రాహుల్..
రిషభ్ పంత్ గాయంతో దూరమవ్వడంతో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మళ్లీ కీపర్ అవతారమెత్తాడు. ఎక్స్‌ట్రా పేస్ ఆల్‌రౌండర్ కోసం రోహిత్.. రాహుల్‌ను కీపర్‌గా జట్టులోకి తీసుకున్నాడు. దాంతో నలుగరు ఆల్‌రౌండర్లతో టీమిండియా బరిలోకి దిగింది. అయితే రిషభ్ పంత్‌ను కావాలనే జట్టు నుంచి తప్పించారా? అని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న పంత్‌ను గాయం సాకుతో తప్పించారా? అని ప్రశ్నిస్తున్నారు.

ఇషాన్ ఉండగా రాహుల్ ఎందుకు?
ఇక కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా ఆడించడంపై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ఉండగా.. రాహుల్ ఎందుకని ప్రశ్నించాడు. వికెట్ కీపర్లకు వచ్చేదే చాలా తక్కువ అవకాశాలని అవి కూడా ఇవ్వకుంటే ఎలా? అని నిలదీసాడు. ఈ నిర్ణయం తనను కన్ఫ్యూజ్ చేసిందని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా రాహుల్‌ను కీపర్‌గా ఆడించాలనుకుంటే.. ఇక నుంచి వరుసగా కీపింగ్ బాధ్యతలు ఇవ్వాలన్నాడు. ఐపీఎల్‌లో కూడా అతన్ని కీపింగ్ చేయమని చెప్పాలని మరో ట్వీట్ చేశాడు.

కష్టాల్లో భారత్..
బంగ్లాతో తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 156 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగుతోంది. ఓపెనర్ శిఖర్ ధావన్(7)ను హసన్ మిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. షకీబ్ అల్ హసన్ ఒకే ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ(27), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(9)లను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(24) కూడా ఔటవ్వడంతో 92 పరుగులకే భారత్ 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో వాషింగ్టన్ సుందర్(19)తో కలిసి రాహుల్ కీలక భాగస్వామ్యం అందించాడు. అయితే షకీబ్ సుందర్‌ను క్యాచ్ ఔట్ చేయడంతో ఐదో వికెట్‌కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత 4 పరుగుల వ్యవధిలోనే షెహ్‌బాజ్(0), శార్దూల్ ఠాకూర్(2), దీపక్ చాహర్(0) ఔటయ్యారు. క్రీజులోకి వచ్చిన సిరాజ్‌తో రాహుల్ పోరాడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications