స్వదేశంలో అత్యంత వేగంగా 250 వికెట్లు: ముత్తయ్య ప్రపంచ రికార్డుని సమం చేసిన అశ్విన్

హైదరాబాద్: ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున టెస్టుల్లో సొంతగడ్డపై అత్యంత వేగంగా 250 వికెట్లు సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
గురువారం బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో ఆ జట్టు కెప్టెన్ మోమినుల్ హక్(37) వికెట్‌ను తీయడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. తన 42వ టెస్టులోనే అశ్విన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ రికార్డుని అశ్విన్ సమం చేశాడు.

ముత్తయ్య రికార్డు సమం
ముత్తయ్య మురళీధరన్ కూడా స్వదేశంలో తన 42వ టెస్టులోనే 250 వికెట్ తీయడం విశేషం. టెస్టుల్లో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన బౌలర్‌గా అశ్విన్ అరుదైన గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ బద్దలు కొట్టాడు. కుంబ్లే స్వదేశంలో తన 43వ టెస్టులో 250 వికెట్‌ను సాధించాడు.

మూడో స్థానంలో హర్భజన్ సింగ్
ఇదిలా ఉంటే, ఈ జాబితాలో హర్భజన్ సింగ్ మూడో స్థానంలో ఉన్నాడు. స్వదేశంలో హర్భజన్ తన 51వ టెస్టులో ఈ మైలురాయని అందుకున్నాడు. మొత్తంగా చూస్తే స్వదేశంలో 250 అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన జాబితాలో శ్రీలంక దిగ్గజం మురళీ ధరన్‌తో కలిసి అశ్విన సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.
గంగూలీని చూసి భయపడ్డావ్: రవిశాస్త్రి బౌలింగ్‌పై నెటిజన్ల జోకులు!
తొలి భారత బౌలర్ అశ్వినే
టెస్టుల్లో అనిల్ కుంబ్లే, హర్భజన్‌ల తర్వాత ఈ మైలురాయి సాధించిన తొలి భారత బౌలర్ కూడా అశ్వినే. టెస్టుల్లో ఇప్పటివరకు అశ్విన్ 359 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు తీసిన బౌలర్లు:
42 Muttiah Muralitharan (SL)/ R Ashwin (IND)
43 Anil Kumble (IND)
44 Rangana Herath (SL)
49 Dale Steyn (SA)
51 Harbhajan Singh (IND)

140 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన బంగ్లా
ఇండోర్ వేదికగా భారత్‌తో జరుగుతన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఆటలో భాగంగా 140 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లు తమ విజృంభణ కొనసాగిస్తుండటంతో బంగ్లాదేశ్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం 56 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. క్రీజులో జయేద్(2), తైజుల్ ఇస్లాం పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications