Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంగూలీని చూసి భయపడ్డావ్: రవిశాస్త్రి బౌలింగ్‌పై నెటిజన్ల జోకులు!

Ravi Shastri Trolled Again After He Posted His Bowling Pictures || Oneindia Telugu
Dada ka khauf: Ravi Shastri trolled again after India coach posts his bowling pictures

హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా బుధవారం టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చింది. సాధారణంగా నెట్స్‌లో ఎప్పుడూ భారత క్రికెటర్లకు కేవలం సూచనలిచ్చే రవిశాస్త్రి తాజాగా బౌలింగ్‌ చేస్తూ కనిపించాడు.

నవంబర్ 14న బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టుకు ముందు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో రవిశాస్త్రి బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన రవిశాస్త్రి "ఓల్డ్‌ హాబిట్స్‌ డై హార్డ్‌" అనే కామెంట్ పెట్టాడు. దీంతో రవిశాస్త్రి చేసిన ట్వీట్‌పై రవిశాస్త్రిని నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు.

"బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎంపికైన తర్వాత వచ్చిన ప్రధాన మార్పు ఏమైనా ఉంటే ఇదే.. ఎప్పుడూ చేతిలో అల్కాహల్‌ బాటిల్‌తో కనిపించే రవిశాస్త్రి సూప్ తాగుతున్నాడు" అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.... మరొక నెటిజన్ "ఓల్డ్‌ హాబిట్స్‌ డై హార్డ్‌ ఏమీ కాదు, గంగూలీని చూసి భయపడుతున్నావ్‌. అందుకే ఎప్పుడూ బద్ధంగా ఉండే నువ్వు బౌలింగ్‌ చేస్తున్నావ్‌" అని ఎద్దేవా చేశాడు.

Story first published: Thursday, November 14, 2019, 13:28 [IST]
Other articles published on Nov 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+