Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

1st Test Day 2: ఇండోర్ టెస్టులో మయాంక్ సెంచరీ, భారీ ఆధిక్యం దిశగా భారత్

India vs Bangladesh Live Score 1st Test Day 2: Mayank Agarwal Hits 3rd Test Century in Indore

హైదరాబాద్: ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించాడు. 184 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 101 పరుగులతో మయాంక్ అగర్వాల్ సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌కు ఇది 3వ సెంచరీ కావడం విశేషం.

ఇటీవల విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ బాదిన మయాంక్‌ ఈ మ్యాచ్‌లో సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 62 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. స్వదేశంలో నాలుగో టెస్టు ఆడుతోన్న మయాంక్ అగర్వాల్‌కు ఇది మూడో సెంచరీ.

మయాంక్ అగర్వాల్ మూడో సెంచరీ

మయాంక్ అగర్వాల్ మూడో సెంచరీ

మయాంక్ అగర్వాల్ సెంచరీతో టీమిండియా 200 పరుగుల స్కోరుని దాటింది. ప్రస్తుతం 62 ఓవర్లకు గాను టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ (104), రహానే(44) పరుగులతో ఉన్నారు. 86/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో శుక్రవారం ఆటను ప్రారంభించిన పుజారా-మయాంక్ నిలకడగా ఆడారు.

#30YearsOfSachinismని సెలబ్రేట్ చేస్తోన్న సచిన్ అభిమానులు: రికార్డులు, సాధించిన విజయాలివే!

పుజారా హాఫ్ సెంచరీ

పుజారా హాఫ్ సెంచరీ

అయితే, పుజారా(54) హాఫ్‌ సెంచరీ తర్వాత పెవిలియన్‌ చేరగా, మయాంక్‌ అగర్వాల్ మాత్రం హాఫ్ సెంచరీని సెంచరీగా మలిచాడు. పుజారా ఔటైన తర్వాత అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ రాశ పరిచాడు. జాయేద్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత రహానేతో మయాంక్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

150 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్

150 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్

ఇద్దరూ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టు 150 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా జట్టు స్కోరు 14 పరుగుల వద్ద ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (6) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత పుజారా-మయాంక్‌‌లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

Story first published: Friday, November 15, 2019, 13:54 [IST]
Other articles published on Nov 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+