For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

#30YearsOfSachinismని సెలబ్రేట్ చేస్తోన్న సచిన్ అభిమానులు: రికార్డులు, సాధించిన విజయాలివే!

Sachin Tendulkar: Fans celebrate #30YearsOfSachinism: 30 Years Since International Debut, 30 Standout Numbers

హైదరాబాద్: 16 ఏళ్ల 205 రోజులు: ముష్తాక్ మొహమ్మద్, ఆకిబ్ జావేద్‌ల తర్వాత అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మూడో పిన్న వయస్కుడిగా సచిన్ వయసు ఇది. ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే.

ఆ బాలుడు ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒకదాని తరువాత మరొకటి రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు ఎన్నో మైలురాళ్లను నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరూ సాధించలేనటువంటి రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా సచిన్ టెండూల్కర్ అంతటి పాపులారిటీని దక్కించుకోలేకపోయారు.

అంతర్జాతీయ క్రికెట్‌లోకి సచిన్ టెండూల్కర్ అరేంగేట్రం చేసిన 30 ఏళ్లు అయింది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1989, నవంబర్ 15న సచిన్ టెండూల్కర్ కరాచీ వేదికగా పాకిస్థాన్‌పై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ని ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అభిమానులు #30YearsOfSachinism అంటూ శుక్రవారం ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

ఇంగ్లాండ్‌పై తొలి టెస్టు సెంచరీ

ఇంగ్లాండ్‌పై తొలి టెస్టు సెంచరీ

17 ఏళ్ల 107 రోజులు: 1990 మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ తన తొలి టెస్టు సెంచరీని సాధించాడు.

34357: అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ చేసిన పరుగులు.

100: అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ చేసిన సెంచరీలు. ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్(71) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

15921: టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ చేసిన పరుగులు.

51: టెస్టు క్రికెట్ చరిత్రలో సచిన్ చేసిన పరుగులు.

ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు సెంచరీలు

ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు సెంచరీలు

53.78: టెస్టుల్లో రెండో అత్యధిక యావరేజిని(మినిమమ్ 2000 పరుగులు) కలిగిన ఆటగాడు.

11: టెస్టుల్లో ఆస్ట్రేలియాపై సచిన్ చేసిన సెంచరీలు(the best Test playing nation during his career)

55: టెస్టుల్లో ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ యావరేజి.

6: క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన సంవత్సరాలు. దీనిలో 1000కిపైగా టెస్ట్ పరుగులు ఉన్నాయి. (సచిన్ 1997, 1999, 2001, 2002, 2008 మరియు 2010 సంవత్సరాల్లో ఒకే సంవత్సరంలో టెస్ట్ క్రికెట్లో 1000కిపైగా పరుగులు చేశాడు. మరే ఇతర బ్యాట్స్ మాన్ ఈ ఘనతను సాధించలేదు)

ఓపెనర్‌గా అరుదైన ఘనత

ఓపెనర్‌గా అరుదైన ఘనత

154: టెస్టుల్లో అత్యంత వేగంగా 8000 పరుగులను అందుకున్న రెండో ఆటగాడు.

40-plus: టెండూల్కర్ తన కెరీర్లో బ్యాటింగ్ చేసిన మొత్తం 9 టెస్ట్ జట్లతో సగటున 40కిపైగా యావరేజిని కలిగి ఉన్నాడు.

54.74: టెస్ట్ క్రికెట్‌లో ఆసియా బ్యాట్స్‌మన్‌కు అత్యధిక యావరేజి.

18426: వన్డేల్లో సచిన్ టెండూల్కర్ చేసిన పరుగులు.

15310: వన్డే క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ చేసిన పరుగులు. (మార్చి 27, 1994న ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఓపెనర్‌గా 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్‌ను మార్చివేసింది. ఓపెనర్‌గా 15310 పరుగులు చేశాడు. యావరేజి 48.29)

వన్డేల్లో అత్యధిక సెంచరీలు

వన్డేల్లో అత్యధిక సెంచరీలు

49: వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడు.

9: వన్డేల్లో తన ప్రత్యర్ధి జట్టుపై అత్యధికంగా చేసిన సెంచరీలు. (టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు చేశాడు. వెస్టిండీస్‌పై కోహ్లీ 9 సెంచరీలు సాధించాడు)

1894: ఒక కాలెండర్ ఇయర్‌లో సచిన్ టెండూల్కర్ చేసిన అత్యధిక పరుగులు(1998). (టెండూల్కర్ 33 ఇన్నింగ్స్‌లలో 65.31 సగటుతో 1894 పరుగులు చేశాడు. 1998లో 9 సెంచరీలు మరియు 7 హాఫ్ సెంచరీలతో సహా 102.15 స్ట్రైక్ రేట్ ని కలిగి ఉన్నాడు)

వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ

వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ

200 not out: వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మన్ (ఫిబ్రవరి 2010లో గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించాడు)

62: వన్డే క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్న ఆటగాడు.

14: వన్డేల్లో సచిన్ టెండూల్కర్ తీసుకున్న మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుల సంఖ్య.

7: వన్డేల్లో 100కిపైగా యావరేజిని సాధించిన క్యాలెండర్ సంవత్సరాల సంఖ్య(1994, 1996, 1997, 1998, 2000, 2003 మరియు 2007 సంవత్సరాల్లో టెండూల్కర్ 1000కిపైగా పరుగులు చేశాడు. ఈ ఘనత సాధించిన ఇతర బ్యాట్స్ మాన్ కోహ్లీ మాత్రమే.)

1996 నుంచి 1999 వరకు సచిన్ ఎరా!

1996 నుంచి 1999 వరకు సచిన్ ఎరా!

8717: 1st January, 1996 and 31st December, 1999 మధ్య కాలంలో సచిన్ టెండూల్కర్ సాధించిన పరుగులు. ఇది టెండూల్కర్ యొక్క "గోల్డెన్ పీరియడ్". టెస్టులు లేదా వన్డేల్లో ఈ సమయంలో ఎవరూ ఎక్కువ పరుగులు చేయలేదు. ఈ సమయంలో సచిన్ టెస్టుల్లో 61.05 యావరేజితో 14 సెంచరీలు సాధించాడు. ఇక, వన్డేల్లో 47.84 యావరేజితో 20 సెంచరీలు సాధించాడు.

88.05: వన్డేల్లో ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ స్ట్రయిక్ రేట్.

67.35%: టెండూల్కర్ వంద పరుగులు సాధించినప్పుడు వన్డేల్లో టీమిండియా గెలిచిన శాతం. (49లో 33 సార్లు)

వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు

వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు

673: సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్‌లో సచిన్ టెండూల్కర్ సాధించిన పరుగులు (2003)

6: ఒక క్రికెట్ వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ సాధించిన సెంచరీలు. 2019 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ కూడా 6 సెంచరీలు బాదాడు.

2334: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు నాలుగో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు.

618: ఐపీఎల్ 2010లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. ఈ సీజన్‌లో సచిన్ టెండూల్కర్ 15 ఇన్నింగ్స్‌లలో 47.53 సగటుతో 618 పరుగులు సాధించాడు.

Story first published: Friday, November 15, 2019, 12:10 [IST]
Other articles published on Nov 15, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+