
హైదరాబాద్: ప్రతిష్టాత్మక పింక్ బాల్ టెస్ట్‌లో పేసర్లను ఉపయోగించేటప్పుడు ఇరు జట్ల కెప్టెన్లు వినూత్నంగా ఆలోచించాలని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చారిత్రాత్మక డే నైట్ టెస్టు మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
ఈ పింక్ బాల్ టెస్ట్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోల్‌కతా అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ "ఫాస్ట్ బౌలర్లను ఇరు జట్ల కెప్టెన్లు వినూత్నంగా వాడుకోవాలి" అని సూచించాడు.
"రెడ్ బాల్ క్రికెట్లో పేసర్లను ఉదయం వినియోగించుకుంటారు. అదే డే నైట్ మ్యాచులో పేసర్లను మధ్యాహ్నం ఒంటి గంటకు కాకుండా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఉపయోగించుకుంటే అద్భుతాలు చేయగలరు. నేను కూకబుర్రా బంతితో ఆడాను. అయితే , పింక్ బాల్ ఎలా ప్రవర్తిస్తుందో చూడడానికి నేను అతృతగా ఉన్నా" అని గంభీర్ అన్నాడు.
"నిజానికి కూకబుర్రాతో పోలిస్తే ఎస్‌జీ చాలా భిన్నంగా ప్రవర్తిస్తుంది. లైట్ల వెలుతురులో మణికట్టు స్పిన్నర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. చేతిలోంచి బంతి బయటకు వస్తున్నప్పుడు గమనించకపోతే ఆడటం సవాల్‌గా ఉంటుంది. బ్లాక్ థీమ్ ఉండి, సంథ్య వెలుగుకు అలవాటు పడితే మణికట్టు స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు" అని గంభీర్ తెలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ప్రస్తుతం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న డే నైట్ టెస్టు 12వది కావడం విశేషం. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పగ్గాలు చేపట్టగానే డే నైట్ టెస్టుల గురించి ప్రధానంగా చర్చ సాగింది.
ముంబైలో జరుగుతుందా లేదా?: భారత్-విండిస్ తొలి టీ20పై అనిశ్చితి!z
ఈ ఏడాది ఆరంభంలో క్రికెట్ ఆస్ట్రేలియా డే నైట్ టెస్ట్ ఆడాలని ఆహ్వానించినప్పటికీ బీసీసీఐ తిరస్కరించింది. అయితే, ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పగ్గాలు చేపట్టడం.. టీమిండియా సైతం డే నైట్ టెస్ట్ ఆడతామని అంగీకరించడంతో అతి తక్కువ సమయంలో ఈ డే నైట్ టెస్ట్‌కు ఈడెన్ గార్డెన్స్ ముస్తాబైంది.
నవంబర్ 22 నుంచి 26 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే తొలి డే నైట్ టెస్టుకు క్యాబ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో డే నైట్ టెస్టు ఆడిన 9, 10వ జట్లుగా భారత్, బంగ్లాదేశ్‌లు నిలిచాయి. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే డే నైట్ టెస్టు మ్యాచ్ 12వది కావడం విశేషం.
ఈ డే నైట్ టెస్టుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్యాబ్ అంగరంగవైభవంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే కోల్‌కతాలోని వీధులన్నీ గులాబీమయం అయ్యాయి.