For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైలో జరుగుతుందా లేదా?: భారత్-విండిస్ తొలి టీ20పై అనిశ్చితి!

India vs West Indies 2019 : India-West Indies Mumbai T20I In Doubt ! || Oneindia Telugu
First India-WI T20 in doubt as Mumbai police yet to guarantee security cover

హైదరాబాద్: డిసెంబర్ 6న భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20పై అనిశ్చితి నెలకొంది. ఈ మ్యాచ్‌ని ముంబై నుంచి మరో వేదికకు తరలించాలని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ)ను స్థానిక పోలీసులు కోరారు. మ్యాచ్‌కు నిర్వహణకు సరిపడా భ్రదతా సిబ్బంది కేటాయించలేమని కూడా పోలీసులు తెలిపారు.

భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం తొలి టీ20 డిసెంబర్‌ 6న ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యమిస్తోంది. అయితే, అదే రోజున బాబ్రీ మసీద్‌ కూల్చివేసిన దినం. అంతేకాదు దాంతోపాటు డిసెంబర్‌ 6న బాబాసాహెబ్‌ అంబేద్కర్ వర్ధంతి.

అంబేద్కర్ వర్ధంతిని 'మహాపరినిర్వాణ్‌ దివస్‌'గా జరుపుకునే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దాదర్‌లోని చైతన్యభూమికి పెద్ద ఎత్తున అంబేద్కర్ ఫాలోవర్స్ వస్తారు. ఈ రెండు కార్యక్రమాలకు వేల సంఖ్యలో బలగాలను ముంబై నగరంలో మోహరించాల్సి ఉంటుంది. దీంతో మ్యాచ్‌ నిర్వహణకు సరిపడ పోలీసులను కేటాయించలేమని పోలీసులు తెలిపారు.

సాధారణంగా ముంబైలో అంతర్జాతీయ మ్యాచ్‌ జరిగితే భద్రత నిమిత్తం 1200 మంది పోలీసులతో పాటు 300 మంది ట్రాఫిక్‌ పోలీసులను కేటాయిస్తారు. అయితే, ఈసారి పెద్దమొత్తంలో పోలీసులను కేటాయించే పరిస్థితి లేదు. దీనిపై స్పష్టత కోసం ముంబై క్రికెట్ ఆసోసియేషన్ అధికారులు శుక్రవారం నగర పోలీసు కమిషనర్‌ సంజయ్‌ బార్వ్‌ను కలవనున్నారు.

డిసెంబర్ 6వ తేదీన మ్యాచ్ నిర్వహణకు సరిపడా పోలీసులు లేనప్పుడు సొంత ఖర్చులతో ప్రైవేట్ సెక్యూరిటీతో భద్రత ఏర్పాటు చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముంబై పోలీసుల ఉన్నతాధికారులను సీనియర్ అధికారులు కలిసిన వెంటనే ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి.

దీనికీ అంగీకరించకపోతే డిసెంబర్‌ 6 మ్యాచ్‌ను హైదరాబాద్‌కు, 11న అక్కడ జరగాల్సిన మ్యాచ్‌ను ముంబైకి తరలించాలే ఆలోచనలో ఉన్నారు. అయితే, వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ని మరొక చోట నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఎంసీఎలో పాలనాపరమైన సమస్యల కారణంగా వాంఖడె స్టేడియంలో నిర్వహించాల్సిన మ్యాచ్‌ని బ్రబోర్న్ స్టేడియానికి మార్చిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, November 21, 2019, 18:36 [IST]
Other articles published on Nov 21, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+