Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: ఆ సమస్యే లేదు.. బ్యాటర్లకు పండుగే!

పుణె: వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. బంగ్లాదేశ్‌తో గురువారం పుణె వేదికగా జరగనున్న మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. గత మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభావాలను నుంచి తేరుకోవాలని బంగ్లాదేశ్ అనుకుంటోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా సంచలన ఫలితాలు నమోదవుతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పటిష్టంగా టీమిండియా: గత మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా దుమ్మురేపింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సత్తా చాటింది. సూపర్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోర్లకే కట్టడి చేసిన టీమిండియా.. బ్యాటింగ్‌లోనూ అద్భుత ప్రదర్శనతో సునాయస విజయాలను అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. శుభ్‌మన్ గిల్ కూడా సత్తా చాటితే టీమిండియాకు తిరుగుండదు. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాతో పాటు పేసర్లు సిరాజ్, బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సంచలన ప్రదర్శన కనబరుస్తున్నారు.

India vs Bangladesh Cricket World Cup 2023: Pune Pitch Report and Weather Fore cast

లైట్ తీస్కుంటే అంతే: భారత్‌తో పొలిస్తే బంగ్లాదేశ్ జట్టు బలహీనమే అయినా.. ఆ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం. తమదైన రోజున ఆ జట్టు సంచలన ఫలితాన్ని నమోదు చేస్తోంది. ముఖ్యంగా షకీబ్ అల్ హసన్ సూపర్ ఫామ్‌లో ఉండటం... ముష్ఫికర్ రహీమ్, పేసర్ ముస్తాఫిజుర్, షోంపుల్, తస్కిన్ అహ్మద్ సత్తా చాటుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అంతేకాకుండా ఇరు జట్ల మధ్య జరిగిన గత నాలుగు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ మూడింటిలోనూ విజయం సాధించింది. ఇది టీమిండియాను మరింత కలవరపెడుతోంది.

పిచ్ రిపోర్ట్: పుణె పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. 2017 నుంచి ఇక్కడ జరిగిన ఐదు వన్డేల్లో మూడు సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 300 ప్లస్ రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌కు ప్రత్యేకమైన పిచ్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. పిచ్ ఫొటోలను పరిశీలిస్తే ఫ్లాట్‌గా కనిపిస్తోంది. పిచ్‌పై ఏ మాత్రం గ్రాస్ లేదు. పగుళ్లు కూడా లేవు. బ్యాటర్లు పండుగ చేసుకోనున్నారు.

ఈ మ్యాచ్‌కు భారీ వర్ష సూచన అయితే లేదు. సాయంత్ర వేళ చిరు జల్లులు పడే అవకాశం ఉంది. అయితే మ్యాచ్‌కు అంతరాయం కలిగించే వర్షం అయితే వచ్చే అవకాశం లేదు.

తుది జట్లు(అంచనా): భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్

బంగ్లాదేశ్: తన్జిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సెన్ షాంటో, షకీబ్ అల్ హసన్, టౌహిడ్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మెహ్‌దీ హసన్ మీరాజ్, మహ్మదుల్లా, టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్

Story first published: Wednesday, October 18, 2023, 23:11 [IST]
Other articles published on Oct 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+