న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN చివరి వన్డేకు ఆ గండం అయితే లేదు.. ఆ ఆర్‌సీబీ స్టార్ అరంగేట్రం చేసేనా?

India vs Bangladesh 3rd ODI: Weather Forecast And Pitch Report Of Chattogram

ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా నామమాత్రపు మ్యాచ్‌కు సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండు ఓడిన టీమిండియా.. శనివారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటున్న టీమిండియా.. విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. గాయాలతో ముగ్గురు ఆటగాళ్లు దూరమవడంతో బలహీనమైన టీమిండియా బెంచ్ ఆటగాళ్లతోనే బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో టెస్ట్ సిరీస్ ఆడాలని టీమిండియా భావిస్తుంది.

వర్ష గండ లేదు..

వర్ష గండ లేదు..

ఆ స్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్ పర్యటనలో వర్షంతో విసిగిపోయిన అభిమానులకు బంగ్లాదేశ్ పర్యటనలో మాత్రం ఆ ఆటంక కలగలేదు. తొలి రెండు వన్డేలు జరిగిన మిర్పూర్‌లో వాతావరణం పూర్తిగా సహకరించింది. మూడో వన్డే జరగనున్న చటో గ్రామ్‌లో కూడా వర్షం వచ్చే అవకాశం లేదు. భారత్ మాదిరి పరిస్థితులే బంగ్లాదేశ్‌లో ఉండనున్నాయి. రోజంతా ఎండ కాచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్ నమోదు కానుంది.

పిచ్‌ ఎలా ఉంది?

పిచ్‌ ఎలా ఉంది?

మిర్పూర్‌లోని షేర్‌-ఎ-బంగ్లా వికెట్ కాస్త బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. చటో గ్రామ్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. బ్యాటింగ్ అనుకూలంగా ఫ్లాట్‌గా పిచ్‌ను సిద్దం చేసే అవకాశాలున్నాయి. మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న భారత్‌ మొదట బ్యాటింగ్‌ చేస్తే సులువుగా 300 పైచిలుకు స్కోరు నమోదు చేయొచ్చు. టాస్ గెలిచిన జట్లు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

రజత్ పటీదార్ అరంగేట్రం చేసేనా..?

రజత్ పటీదార్ అరంగేట్రం చేసేనా..?

కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్లు కుల్దీప్ సేన్, దీపక్ చాహర్ దూరమైన నేపథ్యంలో యువ ఆటగాళ్లు అయిన రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠిలకు అవకాశం దక్కుతుందా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే రెండు పర్యటనలకు ఎంపికైన ఈ యువ ఆటగాళ్లు తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేదు. అయితే ఈ ఇద్దరికి ఇషాన్ కిషన్ నుంచి తీవ్ర పోటీ ఎదురు కానుంది.

ఇషాన్‌కు అవకాశం ఇవ్వకుంటే మాత్రం రజత్ పటీదార్‌కు అవకాశం దక్కవచ్చు. ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రజత్ పటీదార్.. దేశవాళీ క్రికెట్‌లోనూ నిలకడగా రాణించాడు. ఇక జట్టుతో కొత్తగా చేరిన కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు ఖాయం.

తుది జట్లు (అంచనా)..

తుది జట్లు (అంచనా)..

భారత్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), శిఖర్ ధావన్‌, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్/ఇషాన్ కిషన్, శ్రేయస్‌ అయ్యర్, వాషింగ్టన్ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్‌, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్

బంగ్లాదేశ్‌: లిటన్‌ దాస్‌ (కెప్టెన్‌), అనాముల్‌ హక్‌, షకిబ్‌, ముష్ఫికర్‌, మహ్మదుల్లా, అఫిఫ్‌ హుస్సేన్‌, యాసిర్‌ అలీ, మెహదీ హసన్‌ మిరాజ్‌, హసన్‌ మహ్మూద్‌, ముస్తాఫిజుర్‌, ఎబాదత్‌ హొస్సేన్‌.

Story first published: Friday, December 9, 2022, 20:14 [IST]
Other articles published on Dec 9, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X