
వర్షం గండం లేదు..
ఈ బంగ్లాదేశ్ పర్యటనలో ఇప్పటి వరకు అయితే వర్షం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆటంకం కలిగించలేదు. దాదాపు భారత్‌లో ఉన్న వాతావరణ పరిస్థితులే బంగ్లాదేశ్‌లో ఉంటాయి. ప్రస్తుం అక్కడ శీతాకాలం కావడంతో వర్షాలు వచ్చే సూచనల్లేవ్. అయితే భారత్‌లో అక్కడక్కడ వాతావరణ చల్లబడటం.. తీర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్న నేపథ్యంలో రెండో టెస్ట్‌కు ఏమైనా వర్షం ఆటంకం కలిగిస్తుందా? అని భారత అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. అయితే అక్కడ వర్షం పడే అవకాశం లేదని అక్యూ వెదర్ రిపోర్ట్ పేర్కొంది. ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల సెల్సియస్ నుంచి 27 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపింది. ఉక్కపోతగా ఉంటుందని అంచనా వేసింది.

పిచ్ ఎలా ఉంది?
మిర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలోని పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆరంభంలో బౌలర్లకు అనుకూలిస్తోంది. ఓపికగా బ్యాటింగ్ చేయడంతో టెక్నిక్‌తో ఆడాల్సి ఉంటుంది. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ మరింత స్లో అవుతోంది. స్పిన్నర్లకు కూడా సహకరిస్తోంది. ఈ వికెట్‌పై కొత్త బంతిని ఎదుర్కొవడం సవాల్‌తో కూడుకున్న పని. టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

కుర్రాళ్లకు మళ్లీ నిరాశే..
రెండో టెస్ట్‌కు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. దాదాపు తొలి టెస్ట్ ఆడిన జట్టునే కొనసాగించవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్‌లో కెప్టెన్ రాహుల్, కోహ్లీ మినహా అంతా పర్వాలేదనిపించారు. బౌలింగ్ విభాగంలో చాలా రోజుల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. అశ్విన్ బ్యాటింగ్‌లో మెరిసాడు. పేసర్లు మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ అదరగొట్టారు. అయితే పిచ్ కండిషన్స్ నేపథ్యంలో బౌలింగ్ విభాగంలో మార్పులు జరగవచ్చు. అయితే టెస్ట్ సిరీస్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న కేఎస్ భరత్, సౌరభ్ కుమార్, అభిమన్యు ఈశ్వరన్‌లకు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.

తుది జట్లు (అంచనా)..
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్
బంగ్లాదేశ్: నజ్ముల్ హెస్సెన్ షాంటో, జకీర్ హసన్, యాసిర్ అలీ, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, నురుల్ హసన్, మెహ్‌దీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్, నజమ్ అహ్మద్, ఖలెద్ అహ్మద్


Click it and Unblock the Notifications
