For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh తొలి టెస్ట్.. రిషభ్ పంత్‌కు షాకిచ్చిన బీసీసీఐ!

 India vs Bangladesh 1st Test: BCCI ignoring Rishabh Pant for vice-captaincy

న్యూఢిల్లీ: పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) షాకిచ్చింది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు గాయం సాకుతో జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ.. ఇప్పుడు అతని వైస్ కెప్టెన్సీపై వేటు వేసింది. మాములగా రోహిత్ శర్మ అందుబాటులో లేనప్పుడు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేస్తే.. రిషభ్ పంత్ వైస్ కెప్టెన్సీ చేసేవాడు. ఇంగ్లండ్ తో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో జ‌స్‌ప్రీత్ బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పినప్పుడు కూడా పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

 వైస్ కెప్టెన్సీ ఇవ్వకుండా...

వైస్ కెప్టెన్సీ ఇవ్వకుండా...

కానీ బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు పంత్ అందుబాటులో ఉన్నా అతన్ని కాదని వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. బీసీసీఐ తాజా నిర్ణయంతో రిషభ్ పంత్‌కు రోజులు దగ్గర పడ్డాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆడితేనే జట్టులో ఉంటాడని లేకుంటే వేటు వేస్తామని బీసీసీఐ పరోక్షంగా హెచ్చరించిందని కామెంట్ చేస్తున్నారు. ఇక బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రివైజ్డ్ టీమ్‌ను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది.

రోహిత్ స్థానంలో అభిమన్యు..

రోహిత్ స్థానంలో అభిమన్యు..

భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు దూరమవడంతో అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ ఎంపికయ్యాడు. ''రోహిత్‌ ముంబైలో స్పెషలిస్ట్‌ దగ్గరికి వెళ్తాడు. బంగ్లాతో మొదటి టెస్టుకు అతడు అందుబాటులో ఉండడు. రోహిత్‌ రెండో టెస్టులో ఆడే విషయంపై బీసీసీఐ మెడికల్ టీమ్ నిర్ణయం తీసుకుంటుంది. సెలక్షన్‌ కమిటీ రోహిత్‌ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసింది'అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్ కూడా..

నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్ కూడా..

రోహిత్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ తొలి టెస్టులో భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడని, అతనికి డిప్యూటీగా పుజారా వ్యవహరిస్తాడని పేర్కొంది. మరోవైపు మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాల స్థానంలో నవ్‌దీప్ సైనీ, సౌరభ్‌ కుమార్‌ సైతం జట్టులోకి వచ్చారు. జయదేవ్ ఉనాద్కత్‌ను కూడా ఎంపిక చేశారు. బంగ్లాతో రెండో వన్డే సందర్భంగా రోహిత్‌ బొటనవేలికి గాయమైన సంగతి తెలిసిందే.

 బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు భారత రివైజ్డ్ టీమ్:

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు భారత రివైజ్డ్ టీమ్:

శుభమన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయాస్ అయ్యర్, చతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ

Story first published: Monday, December 12, 2022, 14:20 [IST]
Other articles published on Dec 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+