India vs Australia: బాక్సింగ్ డే టెస్టు అంటే ఏమిటీ? అసలు ఆ పేరు ఎలా వచ్చింది?

మెల్‌బోర్న్: రెండు రోజులు పైచేయి సాధించి ఒక్క గంట చెత్తాటతో అడిలైడ్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన టమిండియా మరికొన్ని గంటల్లో రెండో టెస్ట్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా మరికొన్ని గంటల్లో రెండో టెస్ట్‌లో బరిలోకి దిగబోతుంది. శనివారం నుంచి జరిగే ఈ బాక్సింగ్ డే టెస్ట్ ఇండియాకు అత్యంత కీలకం కానుంది. అయితే ఈ మ్యాచ్‌ను బాక్సింగ్ డే టెస్ట్ అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం. క్రిస్మస్ తరువాతి రోజును ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలలో బాక్సింగ్ డే గా జరుపుకుంటారు. చాలా దేశాలలో ఈ రోజును సెలవు దినంగా పాటిస్తారు.

ప్రతీ ఏడాది..
అయితే బాక్సింగ్ డే కు బ్రిటన్ మూలాలున్నాయి. ఒకప్పుడు బ్రిటీష్ పాలనలో ఉన్న దేశాల్లో ఈ రోజును ఉత్సాహంగా జరుపుకుంటారు. పాశ్చాత్య క్రైస్తవ మత క్యాలెండర్ ప్రకారం క్రిస్మస్ పండగ తర్వాత రెండో రోజును బాక్సింగ్ డే గా పాటిస్తారు. దీనినే సెయింట్ స్టీఫెన్స్ డే అని కూడా అంటుంటారు. కాటలోనియా, ఐర్లాండ్, స్పెయిన్‌లలో దీనిని ఆ పేరుతో పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియాలో ఈ రోజున టెస్ట్ మ్యాచ్‌లు ఆడతారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా-భారత్ జట్లు డిసెంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి.

క్రిస్మస్ బాక్సులతో..
ఈ రోజు సెలవు దినం కావడంతో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ బాక్సులను ఇస్తారు. ఆ బాక్స్‌లు ఇచ్చే సంప్రదాయం నుంచి పుట్టిందే బాక్సింగ్ డే. ఉత్తరాలు, వార్తాపత్రికలు నిండిన చిన్న చిన్న బాక్సులను బహుమతులుగా ఇచ్చే సంప్రదాయం ఇప్పటికీ ఉంది. అయితే ఈ బహుమతులను కేవలం క్రిస్మస్ మరుసటి రోజే కాకుండా అన్ని రోజుల్లో ఇస్తుంటారు. గతంలో భూస్వాములు తమ పొలాల్లో పనిచేసే కూలీలకు ఇలా పెట్టెలో బహుమతులు ఇచ్చేవారు. వీటిలో ఇంటి సామాన్లు, వ్యవసాయ పనిముట్లులాంటివి పెట్టేవారు.

కృతజ్ఞతగా..
ఏడాదంతా తమ వ్యవసాయ పనులు చేసినందుకు యజమానులు పనివాళ్లకు ఈ విధంగా కృతజ్జతలు తెలుపుకునేవారు. క్రిస్మస్ మరుసటి రోజు కాబట్టి పండగ అలసటను మరిచిపోవడానికి, కుటుంబంతో కొంత సమయం గడపడానికి బాక్సింగ్ డే రోజున గ్రామీణ ప్రాంతాలకు వెళతారు. మరికొందరు షాపుల్లో లభించే సేల్ ఆఫర్ల కోసం వెళతారు. నక్కలవేట, ఫుట్‌బాల్‌లాంటి సంప్రదాయ క్రీడలు ఈ రోజు ఎక్కువగా జరుగుతాయి

బాక్సింగ్‌డే రోజున క్రీడలు..
క్రీడలపరంగా బాక్సింగ్‌డే ఒక ముఖ్యమైన రోజు. నక్కల వేట కార్యక్రమం కూడా అదే రోజు జరుగుతుంది. ఎర్రటి కోట్లు ధరించి, వేట కుక్కలను తీసుకుని గుర్రాలపై ప్రయాణించే వ్యక్తులు ఈ సంప్రదాయ క్రీడకు చిహ్నంగా కనిపిస్తారు. ఇప్పుడు నక్కల వేట నిషేధించినా, గుర్రపు స్వారీ, ఫుట్‌బాల్ క్రీడలు కొనసాగుతున్నాయి. చాలా దుకాణాలు ఈ రోజున ఆఫ్టర్ క్రిస్మస్ ఆఫర్లతో అమ్మకాలు సాగిస్తాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications