అడిలైడ్: వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్.. టాలెంటెడ్ యంగ్‌స్టర్స్ ఉన్నా.. ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ టెస్ట్‌లో టీమిండియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఓటమి కొత్త కాకున్నా కోహ్లీసేన ఆడిన తీరునే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవర్‌నైట్ స్కోరు 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. పేసర్లు జోష్ హాజల్‌వుడ్ (5/8), ప్యాట్ కమిన్స్ (4/21) భారత జట్టు వెన్నువిరిచారు.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 53 పరుగులు కలిపి భారత్ ఓవరాల్ స్కోరు 89 పరుగులకు చేరింది. 90 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. 21 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 2 వికెట్లకు 93 పరుగులు సాధించి గెలిచింది. జో బర్న్స్ (63 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీకి తోడు మాథ్యూ వేడ్ (53 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించాడు. అయితే ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మాథ్యూ వేడ్‌ను వృద్ధిమాన్ సాహా రనౌట్ చేశాడు. అయితే ఆ రనౌట్
మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మార్క్ కీపింగ్‌ను తలపించడంతో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
Bizarre dismissal alert!
— cricket.com.au (@cricketcomau) December 19, 2020
What about that from Saha?! #AUSvIND pic.twitter.com/OqMLnSNgCE
అశ్విన్ వేసిన 18వ ఓవర్ రెండో బంతికి ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి షాట్ ఆడేందుకు ప్రయత్నించి వేడ్ ఔటయ్యాడు. బంతి అతడి బ్యాట్‌కు తగిలి సిల్లీ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న పృథ్వీషా కాళ్లకు తాకింది. అది చూసుకోకుండా ముందుకు వెళ్లిన మాథ్యూవేడ్‌ను సాహా ఔట్ చేశాడు. బంతి అక్కడే ఉండడంతో వెంటనే అందుకొని వెనక్కి తిరిగే బంతిని వికెట్లపైకి విసిరాడు. దీంతో ఆస్ట్రేలియా ఓపెనర్ రనౌటయ్యాడు. ఇది అచ్చం ధోనీ చేసే రనౌట్లా ఉంది. ఆ వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్.కామ్ ఏయూ ట్విటర్లో పంచుకోవడంతో వైరల్ అయింది.