రిషభ్ పంత్ రిస్కీ స్టంట్స్.. బ్రో టీమ్‌లో ప్లేస్ ఏమో కానీ అటు ఇటు అయితే ఈ భూమి మీదే ఉండవ్!

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముందు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా జిమ్‌లో వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోను అతను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. 'గుడ్ డే ఎట్ ద ల్యాబ్'అని క్యాప్షన్ జత చేశాడు. అయితే ఆ వీడియోలో పంత్ చేసిన స్టంట్స్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. లాక్‌డౌన్‌లో బరువు పెరిగిన ఈ యువ వికెట్ కీపర్.. జిమ్నాస్టిక్స్ తరహాలో పల్టీలు కొట్టడం అందర్ని ఉలిక్కిపడేలా చేసింది. తన చేతులను కిందకు.. కాళ్లను పైకి లేపుతూ మూడు పల్టీలు కొట్టిన పంత్ అనంతరం డంబుల్స్‌తో వినూత్న రీతిలో కసరత్తులు చేశాడు.

అటు ఇటు అయితే..
అయితే చూడటానికి చాలా రిస్కీగా ఉన్న ఈ స్టంట్స్ అటు ఇటు అయితే తీవ్రగాయాలవుతాయి. దాంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ‘పంత్ బ్రో.. జట్టులో చోటు ఏమో కానీ.. అటు ఇటు అయితే ఈ భూమి మీదనే ఉండవ్'అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. మూడో టెస్ట్ ముందు ఈ రిస్కీ స్టంట్స్ అవసరమా? గాయమైతే ఎవరికి నష్టమని మరొకరు మందలించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

అభిమాని అత్యుత్సాహం..
ఇక కొత్త సంవత్సరం సందర్భంగా రోహిత్ శర్మ, నవదీప్ సైనీ, శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, పృథ్వీ షాలు మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఓ భారత అభిమాని అత్యుత్సాహంతో చేసిన పని క్రికెటర్లను చిక్కుల్లో పడేసింది. ఎలాంటి అనుమతి లేకుండా వారిని వీడియో తీసిన సదరు అభిమాని.. వారి ఫుడ్ బిల్ కూడా చెల్లించాడు.
నెగటీవ్‌తో..
దాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి వివాదానికి కారణమయ్యాడు. ఆ ట్వీట్‌తో టీమిండియా ఆటగాళ్లు నిబంధనలు ఉల్లఘించారంటూ ఆసీస్ మీడియా కథనాలు రాసింది. దాంతో వారందరిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి కరోనా టెస్టులు నిర్వహించగా అందరికి నెగెటివ్ అని తేలడంతో వివాదం సద్దుమణిగింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు గురువారం నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications