Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: హమ్మయ్యా స్మిత్ ఔటయ్యాడు..!

India vs Australia: Washington Sundar gets Steve Smith on debut

బ్రిస్బేన్: భారత్‌తో గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌‌లో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. టీమిండియా అరంగేట్ర స్పిన్నర్ వాషింగ్టన్ సుంధర్ బౌలింగ్‌లో ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(77 బంతుల్లో 36) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. సుంధర్ వేసిన 35 ఓవర్ తొలి బంతిని స్మిత్ మిడాఫ్ మీదుగా షాట్‌కు ప్రయత్నించగా.. షార్ట్ మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ చేతిలో పడింది. దాంతో స్మిత్ నిరాశగా వెనుదిరిగాడు.

అశ్విన్ స్థానంలో జట్టులోకి వచ్చిన సుందర్ బౌలింగ్‌లో స్మిత్ ఔట్ కావడం చర్చనీయాంశమైంది. ఈ సిరీస్‌లో ఎక్కువ భాగం అశ్విన్ బౌలింగ్‌లోనే స్మిత్ ఔటైన విషయం తెలిసిందే. ఇక ఈ వికెట్ సుంధర్‌కు టెస్ట్‌ల్లో ఫస్ట్ వికెట్ కావడం గమనార్హం.

ఇక ఆ తర్వాత మాథ్యూవేడ్ క్రీజులోకి రాగా.. మార్నస్ లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ విహారీ నేలపాలు చేశాడు. నవ్‌దీప్ సైనీ వేసిన బౌన్సర్ లబుషేన్ బ్యాట్‌కు తగిలి స్లిప్‌లో ఉన్న రహానే వైపు దూసుకెళ్లగా అతను అందుకోలేకపోయాడు. ఇక ఈ బంతి వేస్తూ సైనీ గాయపడ్డాడు. వెంటనే టీమిండియా ఫిజియో అతన్ని పరీక్షించింది. గజ్జలో గాయమవడంతో సైనీ మైదానం వీడాడు. ఈ ఓవర్‌లో మిగిలిన బంతిని రోహిత్ శర్మ వేసాడు. ఆ వెంటనే నటరాజన్ వేసిన 50 ఓవర్‌లో లబుషేన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను పంత్, పుజారా నేలపాలు చేశారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న లబుషేన్.. సుందర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇక గాయంతో మైదానం వీడిన సైనీ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఆసీస్ 49 ఓవర్లలో 3 వికెట్లకు 128 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్(55 బ్యాటింగ్), మాథ్యూవేడ్(19 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Friday, January 15, 2021, 10:06 [IST]
Other articles published on Jan 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+