Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్ తొండాట ఆడకుంటే అప్పుడే సిడ్నీ టెస్ట్ గెలిచేవాళ్లం: వీవీఎస్ లక్ష్మణ్

India vs Australia: VVS Laxman recalls umpiring ‘blunders’ during 2008 Sydney Test

సిడ్నీ: నాలుగు టెస్ట్‌ల బోర్డర్-గావస్కర్ ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా ఆ దిశగా అడుగులేస్తోంది. తొలి టెస్ట్‌లో ఘోరంగా ఓడినా రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థిని చావు దెబ్బ తీసి లెక్క సరిచేసింది. చెరో విజయంతో ఇరు జట్లు సిరీస్‌లో ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిడ్నీ వేదికగా గురువారం ప్రారంభం కానున్న మూడో టెస్ట్ ఫలితం సిరీస్‌ను ప్రభావితం చేయనుంది. అయితే సిడ్నీ మైదానంలో భారత్‌కు మంచి రికార్డు లేదు.

1978 తర్వాత టీమిండియా ఈ మైదానంలో ఒక్క విజయాన్ని అందుకోలేకపోయింది. గత 42 ఏళ్లుగా విజయం కోసం నిరీక్షిస్తోంది. అయితే 2008లోనే గెలిచేవాళ్లమని, కానీ అంపైర్ తప్పిదాల కారణంగా తృటిలో విజయాన్ని చేజార్చుకున్నామని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు.

మంకీగేట్ కాదు..

మంకీగేట్ కాదు..

భారత్-ఆసీస్ మూడో టెస్ట్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ క్రికెట్‌ కనెక్టెడ్ షోలో పాల్గొన్న ఈ హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మెన్.. నాటి సిడ్నీ టెస్ట్ పరిస్థితులను నెమరువేసుకున్నాడు. 'మంకీగేట్ వివాదాం కారణంగా అందరికి ఈ సిడ్నీ టెస్ట్ గుర్తుండిపోయింది. కానీ గెలిచే మ్యాచ్‌ను అంపైర్ తప్పిదం కారణంగా ఓడిపోయామని నా మనసులో ఉండిపోయింది. మెల్‌బోర్న్ టెస్ట్ ఓడిన తర్వాత సిడ్నీ టెస్ట్‌లో గెలవడానికి మా ముందు చాలా అవకాశాలున్నాయి.

సైమండ్స్ ఔటైనా..

సైమండ్స్ ఔటైనా..

ముఖ్యంగా మా బౌలర్లు ఆసీస్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు తీశారు. ఆసీస్‌పై కూడా తీవ్ర ఒత్తిడి నెలకొంది. కానీ ఆండ్రూ సైమండ్స్ రెండు, మూడు సార్లు ఔటైనా.. అంపైర్ తప్పుడు నిర్ణయాల కారణంగా బతికిపోయాడు. ముఖ్యంగా ఆర్‌పీ సింగ్ బౌలింగ్‌లో సైమండ్స్ బ్యాట్‌కు తాకిన బంతి శబ్దం నాకింకా గుర్తుంది. బంతి బ్యాట్‌కు తగిలినట్లు పెద్ద సౌండ్ వినిపించింది. కానీ దురదృష్టవశాత్తు అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఆ అవకాశాలతో సైమండ్స్ సెంచరీ సాధించాడు.

బ్లండర్ మిస్టేక్స్..

బ్లండర్ మిస్టేక్స్..

ఇక ఆట చివరి రోజు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ఔట్ కాకున్నా ఔటిచ్చారు. ఈ నిర్ణయాలు మ్యాచ్ ఫలితంపై ప్రభావితం చూపాయి. మంకీగేట్ వివాదం కారణంగా ఈ తప్పులేవి పెద్దగా కనిపించలేదు. ఒకానొక సమయంలో మేం సిరీస్ బాయ్‌కట్ చేయాలనుకున్నాం. కెప్టెన్ అనిల్ కుంబ్లే రాయబారిగా వ్యవహరించాడు. చివరకు బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకోవడంతో మేం సిరీస్‌ను కొనసాగించాం'అని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 122 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 134/6తో కష్టాల్లో పడింది. కానీ అంపైర్ తప్పిదాలతో ఆటను కొనసాగించి సైమండ్స్(162 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించడంతో 463 రన్స్ చేసింది.

భారత్ 532 చేసినా..

భారత్ 532 చేసినా..

అనంతరం భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సచిన్(154), లక్ష్మణ్(109) సెంచరీలతో 532 రన్స్ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 401/7 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో 333 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. అంపైర్ తప్పుడు నిర్ణయాల కారణంగా 210 పరుగులకే ఆలౌటైంది. ద్రవిడ్, గంగూలీలు ఔట్‌ కాకున్నా అంపైర్లు ఔటిచ్చారు. అది భారత్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఇక సిడ్నీలో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఒక్కటంటే ఒక్కటే గెలిచి ఆరింటిలో ఓడింది. ఆ విజయం కూడా 1978లో బిషన్ బేడి సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఇన్నింగ్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. 2019లో గెలుపు దిశగా దూసుకొచ్చిన భారత్.. వర్షం కారణంగా డ్రాతో సరిపెట్టుకుంది. మరీ ఈసారైనా రహానే ఈ 42 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడో లేదో చూడాలి!

Story first published: Wednesday, January 6, 2021, 14:51 [IST]
Other articles published on Jan 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+