అది విరాట్ కోహ్లీకి అలవాటైపోయింది.. పాపం సంజూ శాంసన్.. జట్టులో ఉంటాడో లేదో!

ఢిల్లీ: మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా తుది సమరానికి సిద్ధమైంది. గత మ్యాచ్ వేదికలోనే ఇరు జట్లు ఈరోజు మూడో టీ20లో తలపడనున్నాయి. వన్డే సిరీస్ తరహాలోనే చివరి మ్యాచ్ గెలిచి ఆసీస్ లెక్క సరి చేస్తుందా.. లేక భారత్ తమ జోరు కొనసాగించి రెండోసారి ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందా అనేది ఆసక్తికరం. భారత్ పలు మార్పులతో ఈ మ్యాచ్‌లో దిగే అవకాశం కనిపిస్తుండగా.. ఆస్ట్రేలియా కూడా టెస్టు స్పెషలిస్ట్‌లను దూరంగా ఉంచాలనే నిర్ణయించింది.

సెహ్వాగ్ సెటైర్లు
మూడో టీ20లో భారత్ గెలిచినా.. ఓడినా వచ్చే నష్టమే లేదు. దీంతో భారత్ తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కానీ మ్యాచ్ మ్యాచ్‌కు జట్టులో మార్పులు చేయడం భారత సారథి విరాట్ కోహ్లీకి అలవాటు. కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ మార్పులు చేస్తాడని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు వేశాడు. గాయం కారణంగా రెండో టీ20కి దూరమైన యువ ఆటగాడు మనీష్ పాండే మూడో టీ20లో ఆడొచ్చని వీరూ జోస్యం

మనీష్ ఫిట్‌నెస్ సాధిస్తే
తొలి టీ20 ఆడిన మనీష్ పాండే రెండో టీ20కి దూరం కాగా.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన సంజూ శాంసన్ వేగంగా ఆడినప్పటికీ.. భారీ ఇన్నింగ్స్ మాత్రం ఆడలేకపోయాడు. వచ్చిన కొన్ని అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. వేగంగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకుంటున్నాడు. దీంతో మనీష్ ఫిట్‌నెస్ సాధిస్తే శాంసన్‌కు చోటు దక్కకపోవచ్చు. ఇదే విషయాన్ని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. తాజాగా వీరూ సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లో మాట్లాడుతూ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

కోహ్లీకి అలవాటైపోయింది
'మూడో టీ20కి తుది జట్టులో బలవంతంగా మార్పులు చేయవలసిన అవసరం లేదు. మనీష్ పాండే ఫిట్‌నెస్ సాధిస్తే.. అతడు ఆడాలని చాలా మంది అనుకుంటున్నారు. అయితే మనీష్ ఎవరి స్థానంలో ఆడతాడనేదే ఇక్కడ అసలు విషయం. అయితే రెండు మ్యాచ్‌ల్లో ఆడిన సంజూ శాంసన్ దూకుడుగా కనిపించినప్పటికీ.. పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి పాండే ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే.. విరాట్ కోహ్లీకి ఓ అలవాటు ఉంది. అదే తుది జట్టులో మార్పులు చేయడం. అందుకే పాండే ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి' అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు.

శాంసన్‌కు బ్యాడ్ లక్
గత మ్యాచ్‌ల్లో సరిగా ఆడలేకపోయిన మనీష్ పాండేకు విరాట్ కోహ్లీ మరో అవకాశం ఇస్తాడని వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశాడు. కానీ బ్యాడ్ లక్.. సంజూ శాంసన్‌కు మాత్రమే ఆడే అవకాశం రాకపోవచ్చన్నాడు. ఇక మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్లు లేకుండానే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకున్న భారత్ మరోసారి యువ బౌలర్లనే నమ్ముకోనుంది. భారీ స్కోర్లు నమోదైన గత మ్యాచ్‌లో కూడా కేవలం 20 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన నటరాజన్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ధోనీని చాలా మిస్ అవుతున్నా: కోహ్లీ