ధోనీని చాలా మిస్ అవుతున్నా: కోహ్లీ

సిడ్నీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. అతడి గురించి చర్చలు సాగుతూనే ఉన్నాయి. నిత్యం అతడి పేరు =వార్తల్లో ఉంటుంది. ఇక ప్రస్తుతం కంగారూల గడ్డపై జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20లోనూ ప్రత్యర్థి వైస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ సైతం మహీ మెరుపు వికెట్ కీపింగ్ నైపుణ్యాల గురించి టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌తో మాట్లాడిన విషయం తెలిసిందే. అంతేగాక టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు జట్టులో ధోనీ ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అతడిని తరచూ జ్ఞాపకం చేసుకుంటుంటారు.

Miss You Dhoni
సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ ఎంఎస్ ధోనీని ఎంతో మిస్ అవుతున్నామని భారత అభిమానులు ప్లకార్డులతో మైదానంలో ప్రదర్శించారు. Miss You Dhoni అంటూ ప్లకార్డులు పట్టుకుని సందడి చేశారు. అయితే ఆ సమయంలో బౌండరీ లైన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న భారత సారథి విరాట్ కోహ్లీ అభిమానులతో తాను కూడా మిస్ అవుతున్నాని తెలియజేస్తూ సంజ్ఞ చేశాడు. 'మీ టూ' అంటూ చేతులతో సంజ్ఞ చేశాడు. ఇది చూసిన అభిమానులు కేరింతలతో కాసేపు స్టేడియాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని
రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ ఇదే వేదికగా మంగళవారం జరగనుంది. 2016లో కంగూరూలపై పొట్టి సిరీస్‌ను 3-0తో పట్టేసిన భారత్ మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని తహతహలాడుతున్నది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చివరి పంచ్ కూడా బలంగా ఇచ్చి ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో కొండంత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని భావిస్తున్నది.

పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా
మరోవైపు ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా ఆరాటపడుతున్నది. స్వల్ప గాయంతో రెండో టీ20కి దూరమైన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశముంది. ఫించ్ బ్యాటింగ్‌కు వస్తే.. షార్ట్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. క్లీన్‌స్వీప్‌ను తప్పించుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న కంగారూలు మూడో టీ20లో ఎలాగైనా సత్తాచాటాలని పట్టుదలగా ఉన్నారు. తొలి రెండు వన్డేలు, రెండో టీ20లో ఇక్కడ పరుగుల వరద పారింది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. కాబట్టి మరోసారి భారీ స్కోర్లు ఖాయం. వాతావరణం బాగుంది. వర్ష సూచన లేదు.
India vs Australia: 'దేశం తరఫున గెలిచిన తొలి సిరీస్.. ఇది చిరస్మరణీయం'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications