Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Austraila: టెస్టులకు విరాట్​ కోహ్లీ దూరం.. టీమ్ తోపాటు ఆస్ట్రేలియాకు రోహిత్ శర్మ!

India vs Australia: Virat Kohli to miss last two Tests, Rohit Sharma could travel with India team

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ 2020 సీజన్‌‌‌ ముగిసిన వెంటనే జంబో జట్టు‌తో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా కరోనా బ్రేక్‌‌ తర్వాత తొలి అంతర్జాతీయ సిరీస్‌‌ మొదలు పెట్టనుంది. కంగారూలతో మూడేసి వన్డేలు, టీ20లు సిరీస్‌‌తో పాటు నాలుగు మ్యాచ్‌‌ల టెస్టు సిరీస్‌‌లో కూడా పోటీ పడనుంది. ఓ డే నైట్‌‌ మ్యాచ్‌‌ కూడా ఉండే టెస్టు సిరీస్‌‌ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

కానీ, తొందర్లోనే తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్‌‌ విరాట్ కోహ్లీ ఈ టెస్ట్ సిరీస్‌‌ చివరి రెండు మ్యాచ్‌‌లకు దూరమయ్యే అవకాశం​ కనిపిస్తోంది. అదే జరిగితే అతని ప్లేస్‌‌లో లోకేశ్‌‌ రాహుల్‌‌ మిడిలార్డర్‌‌లో ఎంట్రీ ఇవ్వడం ఖాయం కానుంది. కోహ్లీ భార్య అనుష్క శర్మ జనవరిలో తమ తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. బోర్డు నుంచి అఫీషియల్‌‌గా ఇంకా సమాచారం రానప్పటికీ ఫస్ట్‌‌ రెండు టెస్టులు ముగిసిన వెంటనే కోహ్లీ పెటర్నిటీ లీవ్‌‌ తీసుకునే చాన్సుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

పెటర్నిటీ లీవ్..

పెటర్నిటీ లీవ్..

కుటుంబానికి ప్రాధాన్యత ఉండాలని బీసీసీఐ విశ్వసిస్తుందని, పెటర్నిటీ లీవ్‌‌ తీసుకోవాలని కోహ్లీ నిర్ణయించుకుంటే అతను తొలి రెండు మ్యాచ్‌‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని బోర్డు సీనియర్‌‌ అధికారి ఒకరు చెప్పారు. ‘సాధారణ పరిస్థితుల్లో కూడా కోహ్లీ భారత్‌కు వచ్చి తన బిడ్డను చూసి తిరిగి ఆస్ట్రేలియా‌ వచ్చేవరకు ఒక టెస్టు మిస్సయ్యేవాడు. బ్రిస్బేన్‌‌లో లాస్ట్‌‌ టెస్టులో ఆడేవాడు. కానీ, 14 రోజుల క్వారంటైన్‌‌ రూల్‌‌ అమల్లో ఉంటే మాత్రం అతను తిరిగి జట్టుతో కలవడం కష్టం' అని సదరు అధికారి అభిప్రాయపడ్డారు.

ఆసీస్‌కు రోహిత్..

ఆసీస్‌కు రోహిత్..

గాయం నుంచి కోలుకున్న టీమిండియా పరిమిత ఓవర్ల‌ వైస్‌‌ కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ జట్టుతో పాటు ఆసీస్‌‌ వెళ్లే అవకాశం ఉంది. ‘రోహిత్‌‌ విషయంలో తొందర్లోనే నిర్ణయం తీసుకుంటారు. అయితే అతను జట్టుతో పాటే ఉండి ఫిజియో నితిన్‌‌ పటేల్‌‌, ట్రెయినర్‌‌ నిక్‌‌ వెబ్‌‌ పర్యవేక్షణలో స్ట్రెంత్‌‌ అండ్‌‌ కండీషనింగ్‌‌పై దృష్టిపెడితే బాగుంటుంది' అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. తొడ కండరాల గాయం కారణంగా రోహిత్‌‌ను ఆసీస్‌‌ టూర్‌‌లో ఏ టీమ్‌‌లోకి తీసుకోలేదు. అయితే, హిట్‌‌మ్యాన్‌‌ ఐపీఎల్‌‌ ప్లే ఆఫ్స్‌‌లో బరిలోకి దిగడంతో అతడిని జట్టులో చేర్చాలన్న డిమాండ్లు వస్తున్నాయి. దాంతో, ఈ నెల 27న మొదలయ్యే వన్డే సిరీస్‌‌కు రెస్ట్‌‌ ఇచ్చి టీ20 సిరీస్‌‌లో అయినా రోహిత్​ను ఆడించే ఆలోచన బోర్డు చేయొచ్చు.

బబుల్‌లో కలిసిన విరాట్..

బబుల్‌లో కలిసిన విరాట్..

కాగా, ఐపీఎల్‌‌లో ఆర్‌‌సీబీ పోరాటం ముగియడంతో ఆ టీమ్‌‌ కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ.. ఆసీస్‌‌ టూర్‌‌కు సెలెక్టైన ప్లేయర్ల కోసం ఏర్పాటు చేసిన టీమిండియా బయో బబుల్‌‌లో ప్రవేశించాడు. శుక్రవారం రాత్రే అతను బబుల్‌‌లోకి వచ్చాడని జట్టు వర్గాలు తెలిపాయి. మరోపక్క చతేశ్వర్‌‌ పుజారా, హనుమ విహారితో కలిసి మయాంక్‌‌ అగర్వాల్‌‌ లాంటి ప్లేయర్లు ఇప్పటికే బబుల్‌‌లో ప్రాక్టీస్‌‌ ప్రారంభించారు. ఆసీస్ టూర్‌కు ఎంపికైన ఐపీఎల్‌ 2020 సీజన్‌లో ఇంటి ముఖం పట్టిన జట్లలోని ఆటగాళ్లు కూడా బబుల్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఆర్‌సీబీ ఖేల్ ఖతమ్..

ఆర్‌సీబీ ఖేల్ ఖతమ్..

ఇక భారీ అంచనాల మధ్య ఐపీఎల్ 2020 సీజన్ బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్‌సీబీ పోరాటం బ్యాటింగ్ వైఫల్యంతో ప్లే ఆఫ్స్‌కే పరిమితమైంది. ఫస్టాఫ్‌లో 5 విజయాలతో అదరగొట్టిన ఆర్‌సీబీ.. సెకండాఫ్‌లో మాత్రం తేలిపోయింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడి తీవ్రంగా నిరాశపరిచింది. రన్‌రేట్‌ కాస్త మెరుగ్గా ఉండడం.. లీగ్‌ రెండో అంచెలో వరుస విజయాలతో రేసులోకి వచ్చిన పంజాబ్‌తో పాటు కోల్‌కతా, రాజస్తాన్‌లు కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలవడంతో ఎలాగోలా లక్కీగా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంది. కానీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. అయితే ఒత్తిడికి మారుపేరుగా ఉండే ఆర్‌సీబీ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. అసలు ఆడుతుంది ఆర్‌సీబీనేనా అన్నట్లు వారి ఆట కొనసాగింది. పేలవమైన బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది.

Story first published: Sunday, November 8, 2020, 8:52 [IST]
Other articles published on Nov 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+