India vs Australia: వారెవ్వా కోహ్లీ వాటే క్యాచ్.. అచ్చం చిరుతలానే పట్టేసావ్! (వీడియో)

అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జోరు కొనసాగుతుంది. ఫస్ట్ డే బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌పై ఓపికగా తనదైన బ్యాటింగ్‌తో హాఫ్ సెంచర సాధించి జట్టును గట్టెక్కించిన విరాట్.. రెండో రోజు సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లంతా చెత్త ఫీల్డింగ్‌తో అవకాశాలను చేజార్చుతున్న వేళ.. కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఫార్మార్డ్ ఫీల్డర్‌గా ఉన్న విరాట్ అచ్చం చిరుత పులిలా బంతిని వేటాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అరంగేట్ర ప్లేయర్‌కు షాక్..
ఇక విరాట్ కోహ్లీ సూపర్ క్యాచ్‌తో అరంగేట్ర ప్లేయర్ కామెరూన్ గ్రీన్(11) నిరాశగా పెవిలియన్ చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 40 ఓవర్ మూడో బంతిని గ్రీన్ మిడ్ వికెట్ మీదుగా ఆడగా.. ఫార్వార్డ్‌గా ఉన్న విరాట్ సూపర్ డైవ్‌తో బంతిని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ఇక విరాట్ సూపర్ క్యాచ్‌కు మైదానంలో ఆటగాళ్లతో పాటు టీవీ ముందు ప్రేక్షకులు బిత్తరపోయారు. ఎన్నో ఆశలతో ఫస్ట్ మ్యాచ్ బరిలోకి దిగిన గ్రీన్ అయితే తెల్ల మొహం వేసుకొని పెవిలియన్ బాట పట్టాడు.

కింగ్ కోహ్లీ చిరుతా..
ఇక ఈ సూపర్ క్యాచ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్టార్ ప్లేయర్లు సూపర్ స్టార్లే అంటూ కొనియాడుతున్నారు. బంతిని విరాట్ చిరుతలా వేటాడాడని ప్రశంసిస్తున్నారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. కింగ్ కోహ్లీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సూపర్ క్యాచ్‌తో ఆసీస్ 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

టీ బ్రేక్ సమయానికి 92/5
ఇక సెకండ్ సెషన్ ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో టీమ్ పైన్(9 బ్యాటింగ్), లబుషేన్(46 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ ఇంకా 152 పరుగుల వెనుకంజలో ఉంది. ఓపెనర్లు మాథ్యూ వేడ్(8), జో బర్న్స్(8)లను బుమ్రా పెవిలియన్ చేర్చగా.. కీలక స్టీవ్ స్మిత్(1) వికెట్‌తో పాటు ట్రావిస్ హెడ్(7), కామెరూన్ గ్రీన్(11)లను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులో లబుషేన్(42 బ్యాటింగ్), కెప్టెన్ టిమ్ పైన్ (0 బ్యాటింగ్) ఉన్నారు. అశ్విన్ మూడు వికెట్లుతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.

విరాట్ సూపర్ బ్యాటింగ్..
అంతకుముందు 233/6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 11 పరుగులు మాత్రమే చేసి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 244 పరుగులకే కుప్పకూలింది. 25 బంతులు మాత్రమే ఆడిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ డే ఆటలో విరాట్ కోహ్లీ (180 బంతుల్లో 74; 8 ఫోర్లు) భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. పుజారా (160 బంతుల్లో 43; 2 ఫోర్లు), రహానే (92 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సెంచరీకి చేరువవుతున్న విరాట్.. రహానే కారణంగా రనౌటైన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications