
ఆదిలోనే షాక్:
132 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. మొహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్ శ్రీవాత్స్ గోస్వామీ వికెట్ కీపర్ డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సమయంలో డేవిడ్ వార్నర్, మనీశ్ పాండేలు ఆచితూచి ఆడారు. ఇద్దరూ భారీ షాట్లకు పోకుండా నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. ఈ జోడి 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం వార్నర్ ఔట్ అయ్యాడు. సిరాజ్ వేసిన ఆరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది ఊపుమీదున్న వార్నర్ (17; 17 బంతుల్లో, 3×4).. ఆ తర్వాతి బంతికే క్యాచ్ ఔట్ అయ్యాడు. పవర్‌ప్లే ఆఖరికి సన్‌రైజర్స్ 2 వికెట్లకు 48 పరుగులు చేసింది.

కేన్ హాఫ్ సెంచరీ:
మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్ కలిసి సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో పాండే (24; 21 బంతుల్లో, 3×4, 1×6) పెవిలియన్ చేరాడు. ఆడమ్ జంపా వేసిన బంతి.. బ్యాట్‌కు సరిగా కనెక్ట్ కాకపోవడంతో డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరికొద్ది సేపటికే ప్రియం గార్గ్ కూడా ఔట్ అవ్వడంతో సన్‌రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికి సన్‌రైజర్స్ 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఈ సమయంలో విలియమ్సన్, హోల్డర్ అద్భుతంగా ఆడారు. ఇద్దరూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో కేన్ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. చివరికి ఉత్కంఠ నెలకొన్నా.. హోల్డర్ రెండు బౌండరీలు బాది సన్‌రైజర్స్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.

62 పరుగులకే నాలుగు వికెట్లు:
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ (6)ని రెండో ఓవర్లోనే జాసన్ హోల్డర్ పెవిలియన్‌కు చేర్చాడు. తన తర్వాతి ఓవర్లో దేవదత్ పడిక్కల్ (1)ను కూడా ఔట్ చేసి ఆ జట్టును దెబ్బతీశాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ఏబీ డివిలియర్స్ (56; 43 బంతుల్లో, 3×4, 1×6)తో కలిసి ఆరోన్ ఫించ్ (32; 30 బంతుల్లో, 3×4, 1×6) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ షాబాజ్ వేసిన 9వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి ఫించ్ ఔటయ్యాడు. అదే ఓవర్లో క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ (0) ఫ్రీహిట్ బంతికి రనౌటయ్యాడు. దీంతో బెంగళూరు 62 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

డివిలియర్స్ పోరాటం:
మరోవైపు డివిలియర్స్ తన పోరాటం కొనసాగించాడు. సహచరుల నుంచి సహకారం లభించకపోయినా.. అడపాదడపా బౌండరీలతో బెంగళూరు స్కోరు బోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 39 బంతుల్లో అర్ధ శతకం అందుకున్నాడు. కానీ 18వ ఓవర్లో నటరాజన్ వేసిన అద్భుత యార్కర్‌కు క్లీన్ బౌల్డయ్యాడు. డివిలియర్స్ ఔటవడంతో మెరుపులు లేకుండానే ఇన్నింగ్స్ ముగిసింది. సిరాజ్ (10), సైని (9) అజేయంగా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లల్లో హోల్డర్ మూడు, నటరాజన్ రెండు, షాబాజ్ ఒక వికెట్ తీశారు. ఎలిమినేటర్‌లో ఓటమితో కోహ్లీసేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు బుమ్రాకు ఇవ్వాల్సింది కాదు.. మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు!!


Click it and Unblock the Notifications
