India vs Australia: నేను లేకున్నా రహానే ఉంటాడు.. రఫ్ఫాడిస్తాడు: విరాట్ కోహ్లీ

అడిలైడ్: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్ సిరీస్‌కు తాను అందుబాటులో లేకపోయినా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఉన్నాడని, అతను భారత జట్టును అద్భుతంగా నడిపిస్తాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా డే/నైట్ టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ మీద భారత్‌కు రానున్నాడు. అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండేందుకు విరాట్ ఫస్ట్ టెస్ట్ ముగిసిన వెంటనే స్వదేశం రానున్నాడు.

రహానే రాణిస్తాడు..
అయితే విరాట్ గైర్హాజరీ భారత్ విజయవకాశాలను దెబ్బతీస్తుందని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ విశ్లేషణలపై ప్రీమ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పందించిన విరాట్.. తన గైర్హాజరీతో భారత జట్టుకు వచ్చే నష్టం ఏం లేదని, జట్టును లీడ్ చేసేందుకు రహానే ఉన్నాడని తెలిపాడు. ‘నేను, రహానే గత కొన్నేళ్లుగా కలిసి ఆడుతున్నాం. మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. ఇద్దరం కలిసి బ్యాటింగ్‌లో ఎన్నో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాం. ఆసీస్‌తో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో రహానే జట్టును అద్భుతంగా నడిపించాడు. అతని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. అతనికి జట్టు బలాలు, బలహీనతలు తెలుసు.

ఇదే సరైన సమయం..
పరిస్థితులకు తగ్గట్లు అనుసరించాల్సిన వ్యూహాలపై అవగాహన ఉంది. మేం ఇద్దరం ఒకటే. నా గైర్హాజరీలో రహానే రఫ్ఫాడిస్తాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను ఇక్కడ ఉన్నంత వరకు కెప్టెన్‌గా, ఆటగాడిగా నా సామర్థ్యం మేరకు ఉత్తమ ప్రదర్శన కనబరుస్తాను. రహానే కూడా అదే తరహాలో రాణిస్తాడని ఆశిస్తున్నా. అంతేకాకుండా రహానే ఓ వ్యక్తిగా ఎదగాడానికి, తన సత్తా నిరూపించేందుకు ఇదే సరైన సమయం. ఈ విషయాన్ని నేను గతంలో కూడా చెప్పాను. రహానే వ్యక్తిగతంగా రాణిస్తూ నిలకడైన ప్రదర్శన చేయాలి.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇది నయా టీమ్..
ప్రస్తుతం తాను నయా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నానని విరాట్ చెప్పుకొచ్చాడు. ఈ జట్టు సవాళ్లను స్వీకరిస్తుందని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధిస్తుందన్నాడు. ‘నేనెప్పుడూ కొత్త జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లే భావిస్తాను. నా కెరీర్ ప్రారంభం నుంచి నాది ఇదే శైలి. భారత జట్టుకు సవాళ్లను ఎదుర్కోవడం కొత్త కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రస్తుత జట్టు విజయం సాధిస్తుంది. ముందున్న సవాళ్లను కూడా అలానే అధిగమిస్తుంది'అని విరాట్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications