'కోహ్లీ అంతటి వాడే ఇలా చేయడం సిల్లీగా ఉంది'


పెర్త్ : టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై ఆసీస్ మాజీలు ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కోహ్లీ అమర్యాదగా ప్రవర్తించాడని ఆసీస్ మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ ఆరోపించాడు. కెప్టెన్ స్థాయిలో ఉన్న వ్యక్తి అలా చేయడం తనకు సిల్లీగా అనిపించిందని బుధవారం మీడియాతో వెల్లడించాడు. కోహ్లి ఓ అమర్యాదస్తుడని, వెర్రివాడంటూ వ్యాఖ్యానించాడు. ఈ టెస్ట్‌లో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్, కోహ్లిల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరడం.. భారత్ 146 పరుగుల తేడాతో ఓడిపోవడం తెలిసిందే.
మ్యాచ్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్ షేక్‌హ్యాండ్ ఇచ్చుకునే సందర్భంలో కోహ్లి అమర్యాదకంగా ప్రవర్తించాడని ఫాక్స్ స్పోర్ట్స్‌కు రాసిన కథనంలో జాన్స్‌న్ అభిప్రాయపడ్డాడు.

అతడి కళ్లలోకి కూడా చూడకుండా
‘సాధారణంగా మ్యాచ్ పూర్తయిన అనంతరం ఒకరికొకరు షేక్‌హ్యాండ్స్‌ఇచ్చి, ఒకరి ముఖాలు మరొకరు చూసుకోవడం పరిపాటి. గెలిచిన జట్టును అభినందించాలి. అది క్రీడా స్ఫూర్తికి చిహ్నం. ఇది ఏ జట్టుకైనా వర్తిస్తుంది. కానీ పెర్త్ వేదికగా రెండో టెస్టు పూర్తయిన అనంతరం టిమ్‌పైన్‌కు విరాట్ కోహ్లీ షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. కనీసం అతడి కళ్లలోకి కూడా చూడలేదు. కోహ్లీ అమర్యాదగా ప్రవర్తించాడనిపించింది.
ఐపీఎల్‌లో యువీ పతనం.. రూ.16కోట్ల నుంచి 1 కోటికి జరిగిందిలా!

తాను కోహ్లిననే అహాన్ని ప్రదర్శిస్తూ..
మిగతా క్రికెటర్లలో కంటే విరాట్ కోహ్లీకి ఉండే క్రేజ్ వేరు. అతడు శిఖరాగ్రాన ఉన్నాడు. దాంతో కోహ్లి చాలా మంది క్రికెటర్లకు దూరంగా వెళ్తుంటాడు. తాను విరాట్ కోహ్లిననే అహాన్ని ప్రదర్శిస్తాడు. అతనో వెర్రివాడు. నాకు తెలిసి అతనేం మారలేదు.' అని పేర్కొన్నాడు.

2014లో జాన్సన్ వివాదంలో కోహ్లీని
ఇక టిమ్ పైన్ వ్యవహారంలో కోహ్లి తప్పేం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. కోహ్లిపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ అతనికి మద్దతుగా నిలిచింది. 2014 మెల్‌బోర్న్ టెస్ట్ సందర్భంగా కోహ్లి-జాన్సన్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో కోహ్లీని బంతితో గాయపరచాలని కూడా జాన్సన్ యత్నించాడు.

వాగ్యుద్ధం క్రీడాస్ఫూర్తితోనే జరిగిందని
ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్ మాత్రం కోహ్లీ-పైన్ మధ్య జరిగిన మాటల యుద్ధం క్రీడాస్ఫూర్తితోనే జరిగిందని పేర్కొన్నాడు. ఇలాంటి వ్యవహారాలు ఎప్పటికీ సరదాగా ఉంటాయని, వాటిని సీరియస్‌గా తీసుకోకూడదని అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications