అచ్చిరాని నాలుగు.. క్రీజు వీడిన కోహ్లీ!!

ముంబై: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరుగులేని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో మాత్రం విఫలమయ్యాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ కోసం తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకొని బరిలోకి దిగిన రన్ మిషన్ కేవలం 16 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
33 ఓవర్ రెండో బంతికి స్పిన్నర్ ఆడమ్ జంపాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే గత గణంకాలు పరిశీలిస్తే కోహ్లీ నాలుగోస్థానంలో ఆడిన ప్రతిసారీ విఫలమయ్యాడనే విషయం స్పష్టం అవుతోంది. ఈ మ్యాచ్‌ను మినహాయిస్తే విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో 38 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 56.48 సగటు, 90.49 స్ట్రైక్‌రేట్‌తో 1751 పరుగులు చేశాడు.
మొత్తం పరుగుల్లో దాదాపు 16 శాతం. ఇందులో 7 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2015, జనవరి నుంచి మాత్రం నాలుగో స్థానంలో అంచనాలు అందుకోవడం లేదు. ఆరు సార్లు బరిలోకి దిగితే 9, 4, 3(నాటౌట్), 11, 12, 7 మాత్రమే చేశాడు. ఇప్పుడు వాంఖడె వేదికగా జరిగిన మ్యాచులో 14 బంతులు ఆడి 16 పరుగులే చేశాడు. ఇందులో ఎక్కువ సార్లు స్పిన్నర్ల చేతిలోనే ఔటవ్వడం గమనార్హం.
అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (4) సైతం విఫలమవ్వడంతో 164 రన్స్‌కే ఇండియా 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 39 ఓవర్లలో184/5 స్కోర్ చేసింది. క్రీజులో పంత్(12), జడేజా(13) పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(10) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది.
అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను శిఖర్ ధావన్ తన భుజాలకెత్తుకున్నాడు. కేఎల్ రాహుల్ కొంచెం నెమ్మదిగా ఆడినప్పటికీ... శిఖర్ ధావన్ మాత్రం చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డుని నడిపించాడు. ఈ క్రమంలో 66 బంతుల్లో 9 ఫోర్లు సాయంతో శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ సాధించాడు.
వన్డేల్లో ధావన్‌కు ఇది 28వ హాఫ్ సెంచరీ. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు వందకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, జట్టు స్కోరు 134 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ ముంగిట ఆస్టన్ అగర్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆరు పరుగుల వ్యవధిలోనే శిఖర్ ధావన్(74) సైతం ఔటయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications