Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత కుర్రాళ్లు.. సిరీస్ కైవసం!

ఆస్ట్రేలియా అండర్-19తో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్‌లో భారత్ కుర్రాళ్లు దుమ్మురేపారు. భారత్ వేదికగానే జరుగుతున్న ఈ మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్నారు. పుదేచ్చరీ వేదికగా సోమవారం జరిగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించిన భారత అండర్ 19 టీమ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పుదేచ్చరీ వేదికగానే జరిగిన తొలి వన్డేలోనూ 7 వికెట్లతో గెలుపొందింది.

రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 176 పరుగులకు కుప్పకూలింది. అడిసన్ షెరిఫ్(61 బంతుల్లో 2 ఫోర్లతో 39) టాప్ స్కోరర్‌గా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత కుర్రాళ్లలో సమర్థ్ నాగ్‌రాజ్, మహమ్మద్ ఇనాన్, కిరణ్ కోర్మలే రెండేసి వికెట్లు తీయగా.. యుధజిత్ గుహ, హార్దిక్ రాజ్ తలో వికెట్ తీసారు.

India vs Australia Under 19 Cricket India vs Australia Under 19

అనంతరం భారత అండర్ 19 జట్టు 22 ఓవర్లలో వికెట్ నష్టానికి 177 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సాహిల్ పరాఖ్(75 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్స్‌లతో 109 నాటౌట్) అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించగా.. అభిజ్ఞాన్ కుండూ(53 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో హార్రీ హోక్సెత్రా ఏకైక వికెట్ సాధించాడు.

ఈ సిరీస్‌లో భారత కుర్రాళ్ల ముందు ఆసీస్ యంగ్ ప్లేయర్లు తేలిపోయారు. అప్‌కమింగ్ అండర్ 19 ప్రపంచకప్‌తో పాటు భవిష్యత్తు స్టార్లను వెలికి తీసేందుకు ఐసీసీ యూత్ వన్డే సిరీస్‌లను నిర్వహిస్తూ ఉంటుంది. భారత్ గడ్డపై మూడు వన్డేల సిరీస్‌తో పాటు రెండు అనధికారిక టెస్ట్‌లు ఆడేందుకు యంగ్ ఆస్ట్రేలియా ఇక్కడికి వచ్చింది.

ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత కుర్రాళ్లు.. క్లీన్ స్వీప్‌పై గురిపెట్టారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే సెప్టెంబర్ 26న జరగనుంది.

Story first published: Monday, September 23, 2024, 17:31 [IST]
Other articles published on Sep 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+