India vs Australia: భారత్‌కు మరోషాక్.. గాయంతో సిరీస్ నుంచి మరో పేసర్ ఔట్!

న్యూఢిల్లీ: బాక్సింగ్ డే టెస్ట్ విజయ ఉత్సాహంలో ఉన్న భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ కాలిపిక్క గాయానికి గురైన టీమిండియా స్టార్ పేసర్ ఉమేశ్ యాదవ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మూడో టెస్ట్ ఆడకున్నా చివరి టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడని ప్రచారం జరిగినా.. గాయం తీవ్రత, భవిష్యత్తు సిరీస్‌ల దృష్ట్యా టీమ్‌మేనేజ్‌మెంట్ అతన్ని భారత్‌కు పంపించనుంది. రెండు మూడు రోజుల్లో ఉమేశ్ భారత్‌కు తిరుగిరానున్నాడని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

గాయం తీవ్రత కారణంగానే..
ఇక రెండో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో ఉమేశ్ గాయంతో విలవిల్లాడిన విషయం తెలిసిందే. కాలి(పిక్కల్లో) నొప్పి కారణంగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లోనే మైదానాన్ని వీడాడు. బీసీసీఐ వైద్య బృందం అతనికి ప్రాథమిక చికిత్స అందించినా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి పలు పరీక్షలు నిర్వహించింది. అయితే ఉమేశ్ గాయం మాములుదేనని, చివరి టెస్ట్ వరకు నయం అవుతుందని తొలుత ప్రచారం జరిగింది. కానీ కాలి పిక్క గాయం భవిష్యత్తులో తిరగబెట్టే అవకాశం ఉండటంతో దానికి పూర్తి చికిత్స అందించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. ఈ క్రమంలోనే అతన్ని భారత్‌కు పంపిస్తొందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

నట్టూకి చాన్స్..
ఉమేశ్ యాదవ్ సిరీస్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ టీ నటరాజన్‌కు అవకాశం దక్కనుంది. ప్రస్తుతం నెట్ బౌలర్‌గా సేవలందిస్తున్న నట్టూ.. అన్ని కుదిరితే మూడో టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఈ పర్యటనలోని మూడో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ తమిళనాడు పేసర్ మెరుగ్గా రాణించి అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా టీ20 సిరీస్‌లో తనదైన బౌలింగ్‌తో బుమ్రాను తలపించాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఉమేశ్ సూపర్ బౌలింగ్..
ఇక ఇప్పటికే బాక్సింగ్ డే టెస్టుతో సంప్రదాయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ దిగ్గజాల చేత ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా ఆసీస్ టూర్‌లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఉమేశ్ యాదవ్ మొత్తంగా 39.4 ఓవర్లు బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీశాడు. గాయపడటానికి ముందు ఆస్ట్రేలియా ఓపెనర్ జో బర్న్స్‌ను అతను పెవిలియన్‌కు చేర్చాడు. ఇక ఇప్పటికే మహ్మద్ షమీ గాయంతో ఈ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications