India vs Australia: రహానే సెంచరీకి కోహ్లీ ఫిదా.. కెప్టెన్సీ అంటే ఇది కదా!

మెల్‌బోర్న్: అడిలైడ్ ఘోర పరాజయాన్ని మరిపిస్తూ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ లేని లోటును తీరుస్తూ.. పరుగుల చేయడానికి ఇబ్బందిగా మారిన పిచ్‌పై వరల్డ్ క్లాస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. అసలు సిసలు టెస్ట్ ఇన్నింగ్స్‌తో సెంచరీ బాదిన తాత్కలిక సారథి అజింక్యా రహానేపై ప్రశంసల జల్లు కురుస్తోంది. శభాష్ రహానే అని యావత్ ట్విటర్ ప్రపంచం సెల్యూట్ చేస్తోంది.
జింక్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులు ఫిదా అయ్యారు. సిరీస్‌ను మధ్యలో వదిలి వెళ్లిన విరాట్ కోహ్లీ కూడా రహానేపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'మాకు మరో మంచి గొప్ప రోజు. సరైన టెస్ట్ క్రికెట్ ఎప్పుడూ గొప్పదే. ఖచ్చితంగా జింక్స్ నుంచి ఇదో గొప్ప ఇన్నింగ్స్'అని విరాట్ ట్వీట్ చేశాడు.
ముంబై ఈస్టైల్..
ఇది ముంబై ఈస్టైల్ బ్యాటింగని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసించాడు. ఫస్ట్ రెండు సెషన్లలో అతని ఓపికైన బ్యాటింగ్.. చివరి సెషన్‌లో రహానే ఆడిన తీరు అద్భుతమని, అసలు సిసలు టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడనని ట్విటర్ వేదికగా కొనియాడాడు. ‘కెప్టెన్‌గా సూపర్ సెంచరీ.. రహానే ప్రశాంతత, ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ అద్భుతం. జడేజా బ్యాటింగ్ సూపర్బ్. అరంగేట్ర ఆటగాడు గిల్ ఆకట్టుకున్నాడు.'అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. రహానే నుంచి అద్భుత ఇన్నింగ్స్ అని, క్లాస్ బ్యాటింగ్ అని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసించాడు.
క్లాస్ క్లాసే..
‘అజింక్యా రహానే అద్భుతంగా ఆడాడు. ఆఫ్‌కోర్స్ క్లాస్ పర్మెనెంట్. బోంబె స్కూల్ బ్యాటింగ్ అద్భుతం. అడిలైడ్ కొండచరియాను రహానే తన టాప్ ఇన్నింగ్స్‌తో క్లియర్ చేశాడు. సూపర్ బ్యాటింగ్ అంటూ మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ ట్వీట్ చేశాడు. తీవ్ర ఒత్తిడిలే సూపర్ సెంచరీ.. దటీజ్ రహానే అంటూ సూర్యకుమార్ యాదవ్ కొనియాడాడు. శభాష్ రహానే అని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసించాడు. సెల్యూట్ చేస్తున్న మీమ్ ట్వీట్ చేశాడు.
కెప్టెన్సీ అంటే ఇది కదా
రహానే కెరీర్‌లోనే ఇదో అద్భుతమైన సెంచరీ అని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తన టాప్ ఇన్నింగ్స్‌తో కెప్టెన్సీకి ఉదాహారణగా నిలిచాడని కొనియాడాడు. ‘రహానే కెరీర్‌లో అద్భుత సెంచరీ. అలాగే విదేశాల్లో భారత కెప్టెన్ సాధించిన గొప్ప శతకం. సారథ్యం ఎలా ఉండాలో చెప్పిన గొప్ప ఇన్నింగ్స్ ఇది. రహానే టాప్ ఇన్నింగ్స్‌తో అతనిపై గౌరవం అమాంతం పెరిగిపోయింది'అని చోప్రా ట్వీట్ చేశాడు.

భారత్‌దే ఆధిపత్యం..
ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ విఫలమైనా.. కీలక ఆటగాళ్లు చేతులెత్తేసినా.. రహానే(200 బంతుల్లో 12 ఫోర్లతో 104 బ్యాటింగ్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ టీమిండియాను నిలబెట్టింది. అతని సెంచరీ పోరాటం జట్టును మెరుగైన స్థితిలో నిలిపింది. దాంతో ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. క్రీజులో రహానేతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(104 బంతుల్లో 40 బ్యాటింగ్) ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ రెండేసి వికెట్లు తీయగా.. లయన్ ఓ వికెట్ తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications