ఇలా అయితే తప్పులు తెలుసుకునేది ఎలా? రాహుల్‌కే చాన్స్ ఇవ్వరా? టీమ్ సెలెక్షన్‌పై నెటిజన్ల ఫైర్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సమాయత్తం అవుతోంది. మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు శనివారం నుంచి ప్రారంభం కానుంది. సొంతగడ్డపై రెట్టించిన ఉత్సాహంతో ఆసీస్ సై అంటుంటే.. ఎన్నో ప్రతికూలతల మధ్య భారత్ బరిలోకి దిగుతోంది. ఇక బాక్సింగ్‌డే టెస్టుకు 11 సభ్యులతో కూడిన భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ గైర్హాజరీతో జట్టును తాత్కలిక సారథిగా రహానే నడిపించనుండగా.. నలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది.

రాహుల్‌కు నో ఛాన్స్..
ఫస్ట్ టెస్ట్ విఫలమైన పృథ్వీషా, వృద్దీమాన్ సాహాపై వేటు పడగా.. శుభ్‌మన్ గిల్, పంత్ తుది జట్టులోకి వచ్చారు. ఇక పెటర్నిటీ లీవ్ తీసుకున్న కోహ్లీ స్థానంలో రవీంద్ర జడేజా అవకాశం దక్కించుకోగా.. షమీ స్థానంలో హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్ వస్తాడని అంతా భావించగా.. టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం ఈ కర్ణాటక బ్యాట్స్‌మెన్‌కు మొండిచెయ్యే చూపించింది.
ఇదేం సెలక్షన్
అయితే ఈ టీమ్ సెలెక్షన్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరూ ఈ టీమ్ బాగుందని కామెంట్ చేస్తున్నా.. మరికొందరూ మాత్రం కుర్చీలాటలా ఉందని పేర్కొన్నారు. పృథ్వీషాకు మరో అవకాశం ఇవ్వాల్సిందని, ఇలా జట్టు నుంచి తీసేస్తే అతని తప్పులు ఎలా తెలుసుకుంటాడని కామెంట్ చేస్తున్నారు. సౌరవ్ గంగూలీ తన సారథ్యంలో ఆటగాళ్లకు అండగా ఉండేవాడని గుర్తు చేస్తున్నారు. ఇక బ్యాటింగ్ బలహీనంగా ఉన్న జట్టులో కేఎల్ రాహుల్‌ను తీసుకోవకపోవడం విస్మయం కలిపించిందని మరికొందరూ అభిప్రాయపడ్డారు. కనీసం హనుమ విహారీ స్థానంలోనైనా రాహుల్‌ను తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు.

మరో తప్పు..
ఇక ఫస్ట్ టెస్ట్‌లోనే టీమ్ సెలెక్షన్‌లో తప్పు చేశారని, ఓపెనర్, కీపర్ ఎంపిక సరిగ్గా లేదని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. తీరా రెండో టెస్ట్‌కు వారిపై వేటు వేసి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడంతో పాటు తప్పులు తెలుసుకునే అవకాశం లేకుండా చేశారని పేర్కొన్నాడు.

తుది జట్టు
అజింక్యా రహానే (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications