Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: టెస్ట్‌ల్లో టిమ్ పైన్ అరుదైన రికార్డు.. ఫాస్టెస్ట్ కీపర్‌గా ఘనత!

 India vs Australia: Tim Paine Becomes Fastest Wicket-Keeper To Record 150 Dismissals In Test Cricket

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్ టెస్టుల్లో అరుదైన రికార్డు అందుకున్నాడు. భారత్‌తో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో స్టార్క్ బౌలింగ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (29) క్యాచ్ పట్టిన టిమ్ పైన్.. టెస్టుల్లో వేగంగా 150 వికెట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇందులో 143 క్యాచ్‌లుకాగా.. 7 స్టంపౌట్లు ఉన్నాయి.

టెస్ట్‌ల్లో వేగంగా 150 వికెట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్ల జాబితాలో.. టిమ్ పైన్ కేవలం 33 టెస్టుల్లోనే ఈ మార్క్‌ను అందుకొని అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ 34 టెస్టులతో రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియాకు చెందిన మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 36 టెస్టులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత రెండు స్థానాల్లోనూ ఈ రెండు దేశాలకి చెందిన క్రికెటర్లే ఉన్నారు. సౌతాఫ్రికాకు చెందిన మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ 38 టెస్టుల్లో ఈ మార్క్‌ని అందుకోగా.. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ రోడ్ మార్ష్ 39 టెస్టులతో టాప్-5లో ఉన్నాడు.

ఇక మెల్‌బోర్న్ టెస్ట్‌లో రిషభ్ పంత్ క్యాచ్‌తో పాటు చతేశ్వర్ పుజారా (17), శుభమన్ గిల్ (45) క్యాచ్‌లను కూడా టిమ్ పైన్ అందుకున్నాడు. ఇందులో పుజారా క్యాచ్‌ అయితే మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఫస్ట్ స్లిప్‌లోకి డైవ్ చేసి మరీ ఒంటిచేత్తో టిమ్ పైన్ అందుకున్నాడు.

ఇక రెండో టెస్ట్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి రోజు బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ 195 పరుగలకే ఆలౌటవ్వగా.. రెండో భారత బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతమైన ఆటతో ఆకట్టుకున్నారు. తాత్కలిక సారథి అజింక్యా రహానే(200 బంతుల్లో 12 ఫోర్లతో 104 బ్యాటింగ్) సెంచరీ పోరాటం టీమిండియాను మెరుగైన స్థితిలో నిలిపింది. దాంతో ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. క్రీజులో రహానేతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(104 బంతుల్లో 40 బ్యాటింగ్) ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ రెండేసి వికెట్లు తీయగా.. లయన్ ఓ వికెట్ తీశాడు.

Story first published: Sunday, December 27, 2020, 17:16 [IST]
Other articles published on Dec 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+