క్షమించండి.. చాలా తప్పుగా ప్రవర్తించాను.. స్లెడ్జింగ్‌పై టిమ్ పైన్ పశ్చాతాపం!

సిడ్నీ: భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో తన ప్రవర్తనపై ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ పశ్చాతాపం వ్యక్తం చేశాడు. తాను చేసిన తప్పుకు అందర్ని క్షమాపణలు కోరుతున్నానని తెలిపాడు. మైదానంలో తాను ఇంకా మెరుగ్గా ప్రవర్తించాల్సిన అవసరం ఉందన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అసాధారణ ఆటతీరుతో భారత్ ఓటమి నుంచి గట్టెక్కిన విషయం తెలిసిందే. హనుమ విహారీ, రవిచంద్రన్ అశ్విన్ నిలకడైన బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. అయితే ఈ ఇద్దరి బ్యాటింగ్‌కు విసిగిపోయిన పైన్.. స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. అశ్విన్ పట్ల అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు.

మంచి పేరు తెచ్చుకుంటా..
దాంతో పైన్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆసీస్ కెప్టెన్.. భవిష్యత్‌లో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటానన్నాడు. తన మాటలతో తప్పుడు సంకేతాలిచ్చానని పశ్చాతం వ్యక్తం చేశాడు. 'క్రికెట్‌లో ఇప్పుడు స్టంప్‌మైక్ ఉంటుందనే విషయం తెలిసిందే. దురదృష్టవశాత్తూ నా మాటలతో తప్పుడు సంకేతాలిచ్చాను. అది తెలిసి చాలా బాధపడ్డాను. ఆటలో జాగ్రత్తగా ఉండాలని తెలుసు. భవిష్యత్‌లో ఇలా కాకుండా మంచి పేరు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తా.' అని పైన్ పేర్కొన్నాడు.

అతన్ని తిట్టాలని కాదు..
మూడో రోజు ఆటలో పుజారా ఔట్ కోసం పైన్ అంపైర్ విల్సన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసభ్యపదజాలంతో దూషించాడు. దాంతో పైన్‌పై ఐసీసీ నిబంధన 2.8 ప్రకారం మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించడంతో పాటు ఓ డీ మెరిట్ పాయింట్ కేటాయించారు. ఈ ఘటనపై మాట్లాడిన పైన్.. ఆవేశంలో అసభ్యకరంగా మాట్లాడనని, కానీ అంపైర్‌ను తిట్టాలని కాదని క్లారిటీ ఇచ్చాడు. తాను మరింత మెరుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నాడు.

ఫలితం దక్కలేదు..
ఇక మ్యాచ్ డ్రా అవ్వడంపై పైన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. గత రెండు మ్యాచ్‌ల కన్నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినా విజయం దక్కలేదన్నాడు.'ఫలితాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. మా బౌలర్లు చాలా బాగా ఆడారు. మంచి అవకాశాలు వచ్చాయి. క్యాచ్‌లు వదిలేయడం నేను చేసిన పెద్ద తప్పు. గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే ఇక్కడ మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినా ఫలితం దక్కలేదు. 'అని పైన్ చెప్పుకొచ్చాడు.

మూడు క్యాచ్‌లు చేజార్చి..
ఇక భారత ఆటగాళ్లు ఇచ్చిన మూడు క్యాచ్‌లను పైన్ నేలపాలు చేశాడు. దాంతో మరింత అసంతృప్తికి గురైన అతను నోటికి పనిచెప్పాడు. లైయన్ బౌలింగ్‌లో బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని అశ్విన్.. చెస్ట్ గాడ్ కోసం క్రీజు నుంచి దూరంగా వెళ్లి తిరిగి వచ్చినపుడు.. ''గబ్బా(చివరి టెస్టు వేదిక)కు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఆత్రుతగా ఉన్నా యాష్.. చెప్పింది అర్థమైందా'' అని పైన్ రెచ్చగొట్టాడు. 'మేం కూడా మిమ్మల్ని భారత్‌కు రప్పించాలనే తొందరలో ఉన్నాం. నీకది చివరి సిరీస్ అవుతుంది'అని అశ్విన్ వెంటనే సమాధానమిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications