For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ రికార్డుల మోత!

India vs Australia: This and other stats after India records MCG win
IND VS AUS Boxing Day Test:52nd Away Test victory, Big Records Created after MCG Win| Ajinkya Rahane

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 8 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత్ పలు రికార్డులను సొంతం చేసుకుంది. 2018 బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత ఆసీస్‌ను భారత్ రెండోసారి ఓడించింది. ఫలితంగా ఆసియా జట్లలో ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఎక్కువ సార్లు ఓడించిన జట్టుగా భారత్ రికార్డు అందుకుంది. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై భారత్ మొత్తం 8 సార్లు ఓడించగా.. ఆ తర్వాత పాకిస్థాన్ 4 సార్లు మట్టికరిపించింది. ఇక శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేదు.

10 ఏళ్ల తర్వాత తొలిసారి..

10 ఏళ్ల తర్వాత తొలిసారి..

విదేశాల్లో టాస్ ఓడినా భారత్ మ్యాచ్ గెలవడం గత 10 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇక విదేశాల్లో భారత్‌కు ఎక్కువ విజయాలు అందించిన మైదానంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ నిలిచింది. ఈ గ్రౌండ్‌లో భారత్ ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు గెలిచింది. అంతేకాకుండా ఆసీస్ ఆడిన 100వ టెస్ట్‌లో భారత్ గెలవడం విశేషం. ఇక భారత్‌కు ఈ విజయం 52వ విదేశీ టెస్ట్ విజయం.

రహానే రికార్డుల మోత..

రహానే రికార్డుల మోత..

ఆస్ట్రేలియాలో టెస్ట్ విజయం అందించిన కెప్టెన్లలో ఒకడిగా రహానే నిలిచాడు. గతంలో విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ ఈ ఫీట్ సాధించారు. అంతేకాకుండా బాక్సింగ్ డే టెస్ట్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న రహానే.. ఈ ఘనత సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. రహానే కన్నా ముందు సచిన్, బుమ్రా ఈ ఫీట్ సాధించారు.

బుమ్రా రికార్డు..

బుమ్రా రికార్డు..

మెల్‌బోర్న్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా( 4 ఇన్నింగ్స్‌ల్లో 15 వికెట్లు) లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌కుంబ్లే (15) సరసన చేరాడు. నాలుగో రోజు ఆటలో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా.. కమిన్స్‌(22)ను ఔట్‌ చేయడంతో ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు 2018-19 పర్యటనలో ఈ టీమ్‌ఇండియా పేసర్‌ ఇదే మైదానంలో 9 వికెట్లు తీశాడు. తాజా టెస్టులో 6 వికెట్లు పడగొట్డడంతో కుంబ్లే రికార్డును అందుకున్నాడు. బుమ్రా కన్నా ముందు భారత్‌ తరఫున ఈ మైదానంలో కుంబ్లే, కపిల్‌ దేవ్‌, చంద్రశేఖర్‌ లాంటి దిగ్గజాలు రెండేసి సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం.

అశ్విన్ అరుదైన ఘనత..

అశ్విన్ అరుదైన ఘనత..

టెస్ట్ క్రికెట్‌లో ఎక్కువ మంది లెఫ్టార్మ్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసిన బౌలర్‌గా భారత స్పిన్నర్ రవిచంద్రన్ రికార్డు సృష్టించాడు. ఆసీస్ టెయిలండర్ జోష్ హజల్‌వుడ్‌ను ఆఖరి వికెట్‌గా తీసిన అశ్విన్.. ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ రికార్డును అధిగమించాడు. అశ్విన్ ఇప్పటి వరకు టెస్ట్‌ల్లో 375 వికెట్లు తీయగా.. అందులో 192 మంది లెఫ్టార్మ్ బ్యాట్స్‌మెన్ ఔట్ చేశాడు. ఇక 800 వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ 191 మంది ఏడమచేతి వాటం ఆటగాళ్లను పెవిలియన్ చేర్చాడు. వీరి తర్వాత ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్(186), గ్లేన్ మెక్‌గ్రాత్ (172), షేన్ వార్న్ (172), అనిల్ కుంబ్లే (167) ఈ లెఫ్టార్మ్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసిన జాబితాలో ఉన్నారు.

Story first published: Tuesday, December 29, 2020, 11:47 [IST]
Other articles published on Dec 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+