33 ఏళ్ల తర్వాత ఆసీస్ తొలిసారి ఓటమి!

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో టీమిండియా చారిత్రాత్మక విజయాన్నందుకుంది. రిషభ్ పంత్(89 నాటౌట్), శుభ్‌మన్ గిల్(91) సూపర్ బ్యాటింగ్‌తో మూడు వికెట్లతో గెలుపొందింది. ఈ విజయంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్ 2-1తో కైవసం చేసుకుంది. ఫలితంగా వరుసగా మూడోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకొని రికార్డు సృష్టించింది. గబ్బా మైదానంలో 32 ఏళ్లుగా ఓటమెరుగని ఆసీస్‌ను కంగుతినిపించిన టీమిండియా... టెస్టు ఛాంపియన్ షిప్లో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది.
అసాధారణ బ్యాటింగ్‌తో విజయంలో కీలక పాత్ర పోషించిన రిషభ్ పంత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. సిరీస్ ఆసాంతం ఆకట్టుకున్న ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వరించింది. ఇక ఈ మ్యాచ్‌లో నమోదైన పలు రికార్డుల గురించి తెలుసుకుందాం.

1988 తర్వాత తొలిసారి..
1988 తర్వాత బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో తొలిసారి కంగారులకు ఓటమి ఎదురైంది. గత 33 ఏళ్లలో ఆడిన 31 టెస్టుల్లో 24 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 1988లో వెస్టిండీస్ చివరిసారిగా ఇక్కడ టెస్టు మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే భారత్ చేతిలో ఆసీస్ ఓడింది.
గబ్బా వేదికగా జరిగిన టెస్టు(1988)లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన చివరి జట్టు వెస్టిండీస్. అలాగే ఇక్కడ అత్యధిక ఛేదన కూడా విండీస్ పేరిటే ఉండేది. 1951లో జరిగిన టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ జట్టు 236 పరగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ప్రస్తుతం టీమిండియా ఈ రికార్డును తిరగరాసింది. గబ్బా మైదానంలో 328 పరగుల లక్ష్యాన్ని ఛేదించి అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాకుండా టీమిండియా చేజింగ్ రికార్డుల్లో తాజా మ్యాచ్ మూడోది కాగా.. ఆసీస్ గడ్డపై కూడా మూడో స్థానంలో నిలిచింది.

టీమిండియా అత్యధిక ఛేదన
1975/76 సీజన్‌లో వెస్టిండీస్‌పై 406 పరుగులు
2008/09 సీజన్‌లో ఇంగ్లండ్‌పై 387 రన్స్
2020/21 సీజన్‌లో ఆస్ట్రేలియాపై 328 పరుగులు (తాజా మ్యాచ్)
2011/12 సీజన్‌లో వెస్టిండీస్‌పై 276 పరుగులు
2001లో శ్రీలంకపై 264 పరుగుల ఛేదన
ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగులు..
2008/09 : పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా 414 పరుగులను చేధించింది.
1928/29 : మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 332 పరుగులు అధిగమించింది.
2020/21 : గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ 329 పరుగుల చేధించింది.

తొలి టెస్టు ఓడాక భారత్ సిరీస్ గెలిచిన సందర్భాలు..
1972/73 సీజన్‌లో స్వదేశంలో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో గెలుపు
2000/01 సీజన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో గెలుపు
2015లో శ్రీలంక గడ్డపై ఆ జట్టుపైనే 2-1 తేడాతో విజయం
2016/17 సీజన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం
2020/21 సీజన్‌లో ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో గెలుపు*

ఐదో రోజు అత్యధిక పరుగులు
1948 లీడ్స్ : 404(ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్)
1984 లార్డ్స్ : 344 (వెస్టిండీస్ vs ఇంగ్లండ్)
2020/21 బ్రిస్బేన్ : 325(భారత్ vs ఆస్ట్రేలియా) (తాజా మ్యాచ్)
1977/78 పెర్త్: 317(ఆస్ట్రేలియా vs భారత్)
2017 లీడ్స్: 317(వెస్టిండీస్ vs ఇంగ్లండ్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications