నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగిన టీమిండియా.. ఎందుకంటే..!!


సిడ్నీ: ఆసీస్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా బ్యాట్స్‌మెన్ వారి జెర్సీలపై నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. సచిన్ టెండూల్కర్ గురువు, దిగ్గజ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ బుధవారం ముంబైలోని తన స్వగృహంలో మరణించడంతో అతనికి గురువారం నివాళి అర్పిస్తూ.. క్రికెటర్లు.. నల్ల బ్యాడ్జీలు ధరించి టెస్టు మ్యాచ్‌లో ఆడుతున్నారు. 1932, జనవరి 2న మహారాష్ట్రలో జన్మించిన అచ్రేకర్.. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, అజిత్ అగర్కార్, రమేశ్ పొవార్ తదితర క్రికెటర్లకి శిక్షణ ఇచ్చారు.
బాల్యంలో సచిన్‌కు కోచ్‌గా వ్యవహరించిన అచ్రేకర్.. తనకు ఓనమాలు దిద్దిన గురువు ఇక లేరని తెలియడంతో సచిన్ విషాదానికి గురైయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ట్విట్టర్ వేదికగా ఓ భావోద్వేగపూరిత ట్వీట్‌ను పోస్టు చేశారు. 'సార్ సమక్షంలో ఉంటే నాకు క్రికెట్ స్వర్గంలా అనిపించింది. ఎంతో మంది లాగానే కూడా ఆయన వద్దే క్రికెట్‌లో ఓనమాలు (ఏబీసీడీలు) నేర్చుకున్నాను. నా కెరీర్‌కు ఆయన పునాది వేశారు.'
నాకెంత చేశారనేది మాటల్లో చెప్పలేను
'ఆయన నాకెంత చేశారనేది మాటల్లో చెప్పలేను. గత నెలలో కూడా మరికొందరు శిష్యులతో పాటు వెళ్లి సార్‌ను కలిశాను. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాం. ఆటతో పాటు మమ్మల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దారు. మీ జీవితంలో నాకు కొంత సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. మీ శిక్షణతో నన్ను ఈ స్థానంలో నిలిపారు. నాతోపాటు ఎంతో మందికి అద్భుతమైన నైపుణ్యాలను నేర్పించారు. మీరు ఎప్పుడు మా మనసులో ఉండిపోతారు.
సిడ్నీ వేదికగా కోహ్లీకి సమంగా నిలిచిన పూజారా

కీర్తి ప్రతిష్టలను తెచ్చింది మాత్రం సచినే
ముంబైలో దాదార్‌లోని శివాజీరాజ్ పార్కులో రమాకాంత్ ఎందరో యువ క్రికెటర్లకు కోచింగ్ ఇచ్చేవారు. లెజండరీ క్రికెట్ కోచ్‌గా పేరుగాంచిన అచ్రేకర్ వినోద్ కాంబ్లి, ప్రవీన్ ఆమ్రె, సమీర్ దిఘె, బల్విందర్ సింగ్ సంధు, అజిత్ అగార్కర్ వంటి క్రికెటర్లకు క్రికెటర్లను తీర్చిదిద్దారు. ఆయనకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది మాత్రం సచిన్ టెండూల్కరే. సచిన్ ఆయన ప్రియ శిష్యుడు కూడా. క్రికెట్ రంగంలో అసమాన సేవలందించినందుకు గాను కేంద్రప్రభుత్వం ఆయనకు 1990లో ద్రోణాచార్య అవార్డుతో, 2010లో పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది.

క్రికెటర్‌గా కెరీర్ సక్సెస్ కాకపోవడంతో
ముంబైలోని జింఖాన శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా అచ్రేకర్ కు 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు' ను అందజేశారు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ సుధీర్ఘ కాలం పాటు కొనసాగడంలో అచ్రేకర్ పాత్ర ఎనలేనిది. ప్రతి గురుపౌర్ణమికి ఆయన ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని శాలువా కప్పి సత్కరించేవారు. 1932లో అచ్రేకర్ జన్మించారు. క్రికెట్ కెరీర్ అంత సవ్యంగా సాగలేదు. 1943లో క్రికెట్ ఆడటం ప్రారంభించారు. 1945లో న్యూ హిందు స్పోర్ట్స్ క్లబ్ తరఫున ఆడారు. యంగ్ మహారాష్ట్ర ఎలెవన్, గుల్ మోహర్ మిల్స్, ముంబై పోర్ట్‌కు ప్రాతినిథ్యం వహించారు. 1963-64 మొయిన్‌ద్దౌలా టోర్నీలో ఆల్ ఇండియా స్టేట్ బ్యాంకు జట్టు తరఫున హైదరాబాద్‌పై ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడారు.

సుదీర్ఘ కెరీర్‌లో సచిన్ ఎన్నో సరికొత్త రికార్డులు
1943లో క్రికెట్ కెరీర్‌ని ఆరంభించిన అచ్రేకర్.. 1945లో తొలిసారి న్యూ హింద్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున ఆడాడు. ఆ తర్వాత.. 1963లో ఎస్‌బీఐ తరఫున గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నీలో మ్యాచ్ ఆడిన ఈ కోచ్ దిగ్గజం క్రికెట్ కెరీర్ కేవలం ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కే పరిమితమైంది. ఆ తర్వాత ముంబయిలోని శివాజీ పార్క్‌లో క్రికెట్ శిక్షకుడిగా మారిన అచ్రేకర్.. 11ఏళ్ల వయసులోనే సచిన్ టెండూల్కర్ అసాధారణ ప్రతిభని గుర్తించి సానబెట్టాడు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సచిన్ టెండూల్కర్ ఎన్నో సరికొత్త రికార్డుల్ని నెలకొల్పిన విషయం అందరికీ తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications