Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిడ్నీ వేదికగా కోహ్లీకి సమంగా నిలిచిన పూజారా

Cheteshwar Pujara joins elite list of Indian batsman to face 1000 balls in a Test series Down Under

సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లు మొదలైన నాటి నుంచీ నిలకడైన బ్యాటింగ్‌తో ఆసీస్ బౌలర్లకు చిరాకు తెప్పిస్తున్న పూజారా.. మరోసారి విజృంభించాడు. తొలి టెస్టు, మూడో టెస్టు సెంచరీలు సాధించడంతో పాటు నాలుగో టెస్టులోనూ సెంచరీతో అదరగొట్టాడు. అంతేకాకుండా దాంతో మరో అరుదైన ఘనత నమోదు చేసుకున్నాడు. తనదైన మార్కు ఆట తీరుతో ఆకట్టుకుంటూ భారత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆసీస్‌తో నాలుగో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో పుజారా ఒక మైలురాయిని చేరుకున్నాడు.

1
43626
టెస్టు సిరీస్‌లో వెయ్యికి పైగా బంతుల్ని ఆడి

టెస్టు సిరీస్‌లో వెయ్యికి పైగా బంతుల్ని ఆడి

ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్‌లో వెయ్యికి పైగా బంతుల్ని ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా కూడా చేరిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసిన పుజారా.. మరో 65 బంతుల్లో వంద పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలోనే 19 వేల పరుగుల క్లబ్‌లో కోహ్లీ

2014-15 సీజన్‌లో ఆసీస్‌లో కోహ్లి

2014-15 సీజన్‌లో ఆసీస్‌లో కోహ్లి

ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో వెయ్యి బంతుల్ని ఆడిన ఘనత నమోదు చేసుకున్నాడు. గతంలో 2014-15 సీజన్‌లో భాగంగా ఆసీస్‌లో పర‍్యటించినప్పడు కోహ్లి వెయ్యి బంతుల్ని ఆడి ఔరా అనిపించాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో వెయ్యికి పైగా బంతుల్ని ఆడిన పుజారా.. ఆసీస్‌ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.

టాప్ స్థానంలో నిలిచిన ద్రవిడ్

టాప్ స్థానంలో నిలిచిన ద్రవిడ్

ఇలా ఆస్ట్రేలియా పర్యటనలో ఒక టెస్టు సిరీస్‌లో వెయ్యికి పైగా బంతులు ఆడిన భారత క్రికెటర్లలో ద్రవిడ్‌( 2003-04 సీజన్‌లో 1203 బంతులు)తో ముందుస్థానంలో ఉన్నారు. ద్రవిడ్‌తో పాటుగా విజయ్‌ హజారే(1947-48 సీజన్‌లో 1192 బంతులు), కోహ్లీ(2014-15 సీజన్‌లో 1093 బంతులు), సునీల్‌ గవాస్కర్‌(1977-78 సీజన్‌లో 1032 బంతులు) వరుస స్థానాల్లో నిలిచారు.

Story first published: Thursday, January 3, 2019, 12:35 [IST]
Other articles published on Jan 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+