అభిమానులకు శుభవార్త.. టీమిండియా ఆటగాళ్లకు కరోనా నెగటివ్!! ఆ ఐదుగురికి!!

మెల్‌బోర్న్: టీమిండియా అభిమానులకు శుభవార్త. భారత క్రికెట్ జట్టులోని సభ్యులు, సహాయక సిబ్బంది అందరికి కరోనా వైరస్ నెగటివ్ వచ్చింది. ఆదివారం చేసిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి కరోనా నెగటివ్ వచ్చినట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పష్టం చేసింది. బయో బబుల్ ప్రొటోకాల్ ఉల్లంఘనల ఆరోపణలతో ఐసొలేషన్‌లో ఉన్న వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్, రిషబ్ పంత్, నవ్‌దీప్ సైనీ, పృథ్వీ షాలకు కూడా నెగటివ్ వచ్చిందని బీసీసీఐ తెలిపింది. దీంతో టీమిండియా మేనేజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది.

టీమిండియా ఆటగాళ్లకు నెగటివ్:
'ఆదివారం జరిపిన కరోనా వైరస్ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి కరోనా నెగటివ్ వచ్చింది' అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. రోహిత్ శర్మతో పాటు శుభమన్ గిల్, పృథ్వి షా, నవ్‌దీప్ సైనీ, రిషబ్ పంత్‌లు కొత్త ఏడాది సందర్భంగా మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్‌కు వెళ్లారు. ఆ బిల్లును నవల్‌దీప్ సింగ్ అనే అభిమాని కట్టాడు. దీంతో పంత్ సదరు అభిమానిని హగ్ చేసుకున్నాడన్న వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమయిన క్రికెట్ ఆస్ట్రేలియా అందరినీ ఐసోలేషన్‌లోకి పంపింది. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో వీరికి నెగటివ్ వచ్చింది.

ప్రత్యేక విమానంలో సిడ్నీకి:
ఈ నెల 7వ తేదీ నుంచి ఆతిథ్య ఆసీస్‌తో జరుగనున్న మూడో టెస్టు కోసం భారత ఆటగాళ్లు సోమవారం ప్రత్యేక విమానంలో సిడ్నీ వెళ్లనున్నారు. బయో బబుల్ ప్రొటోకాల్ ఉల్లంఘనల ఆరోపణలతో ఐసొలేషన్‌లో ఉన్న రోహిత్ శర్మ, శుభమన్ గిల్, రిషబ్ పంత్, నవ్‌దీప్ సైనీ, పృథ్వీ షా కూడా మిగిలిన ఆటగాళ్ల వెంటే బయలుదేరనున్నారు. కాగా ఆ ఐదుగురు ఆటగాళ్లు బయో బబుల్ నిబంధనలను పాటించారా లేదా అన్న అంశంపై బీసీసీఐతో సంయుక్తంగా విచారణ చేపడుతున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించిన సంగతి తెలిసిందే.

అలా ఎలా తప్పుపడతారు:
ఐదుగురు భారత ఆటగాళ్లు బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించారని సీఏ తన ప్రకటనలో ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. అది ఉల్లంఘనో కాదో అని తేల్చేందుకే విచారణ జరుపుతున్నట్లు ప్రకటించిందని చెప్పారు. ఓ అభిమాని రెస్టారెంట్‌లో అనుమతి లేకుండా వీడియో తీసి, బిల్ కట్టి పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేస్తే.. దాని ఆధారంగా ఆటగాళ్లను ఎలా తప్పుపడతారని ప్రశ్నించారు. అయితే పంత్ తనను ఆలింగనం చేసుకున్నాడని తొలుత పోస్టు చేసిన ఆ అభిమాని.. తర్వాత అది నిజం కాదని, ఏదో అత్యుత్సాహంలో అలా రాశానని చెప్పిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఆ రెస్టారెంట్‌లోకి వెళ్లేందుకు భారత ప్లేయర్లకు అనుమతి ఉంది.

ప్రాక్టీస్ సెషన్ రద్దు:
అడిలైడ్ ఓటమి తర్వాత పుంజుకొని రెండో టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా ఆత్మైస్థెర్యం దెబ్బ తీసేందుకు ఆసీస్ మీడియా ఇలా చేస్తున్నదన్న విమర్శలూ వస్తున్నాయి. ఇక నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు ఒక్కో గేమ్ గెలవడంతో సిరీస్ ఆసక్తికరంగా మారింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య గురువారం నుంచి మూడో టెస్టు జరగనుంది. ఇక మెల్‌బోర్న్‌లో ఆదివారం వర్షం పడటంతో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్ రద్దయింది.
మరో హాట్‌టాపిక్.. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన కోహ్లీ, హార్దిక్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications