మూడో టీ20లో గెలిస్తే.. భారత్ ఖాతాలో చేరనున్న రెండు రికార్డులు!! అవేంటంటే!

సిడ్నీ: ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే క్లీన్‌స్వీప్ చేసే అవకాశం భారత్ ముగింట నిలిచింది. ఆసీస్‌తో మంగళవారం ఇక్కడ జరిగే చివరి మ్యాచ్‌లోనూ సత్తాచాటి పరిమిత ఓవర్ల ఘట్టాన్ని ఘనంగా ముగించాలని కోహ్లీసేన పట్టుదలగా ఉంది. 2016లో కంగూరూలపై పొట్టి సిరీస్‌ను 3-0తో పట్టేసిన భారత్.. మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని తహతహలాడుతున్నది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చివరి పంచ్ కూడా బలంగా ఇచ్చి ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో కొండంత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని భావిస్తున్నది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా ఆరాటపడుతున్నది.

మూడో టీ20లో గెలిస్తే
మూడో టీ20లో విజయం సాధించడం ద్వారా భారత్ రెండు మైలురాళ్లను చేరుకుంటుంది. రెండో టీ20 మ్యాచులో గెలవడం ద్వారా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్.. ఆస్ట్రేలియాకు చేరువగా వచ్చింది. ఇక మూడో టీ20లోనూ విజయం సాధిస్తే.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం 25 మ్యాచ్‌ల్లో 275 పాయింట్లతో ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. ఆసీస్ ఖాతాలో 274 పాయింట్లు ఉండగా.. చివరి టీ20 గెలిస్తే భారత్ ఖాతాలో 271 పాయింట్లు చేరతాయి.

వరుసగా పది టీ20ల్లో
రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా.. టీమిండియా వరుసగా పది టీ20ల్లో గెలుపొందినట్లయ్యింది. దీంతో టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్ల జాబితాలో పాకిస్థాన్‌ను టీమిండియా వెనక్కి నెట్టింది. తొలి, రెండో స్థానంలోనూ అప్ఘానిస్థాన్ ఉంది. అఫ్గానిస్తాన్ 2016-17 సీజన్‌లో వరుసగా 11 విజయాలు సాధించగా.. 2018-19 సీజన్‌లో 12 విజయాలు సాధించింది. మూడో టీ20 గెలిస్తే.. అప్ఘాన్ జట్టు సరసన భారత్ నిలుస్తుంది.

ఒక్క టీ20 మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు
గత 12 నెలల కాలంలో టీమిండియా ఒక్క టీ20 మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. 2019 డిసెంబర్ నెలలో ముంబై వేదికగా విండీస్‌పై విజయం సాధించిన భారత్.. 2020 ఆరంభంలో శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో గెలుపొందింది. అయితే గౌహతీలో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. న్యూజిలాండ్ పర్యటనలో 5-0 తేడాతో ఆతిథ్య జట్టును వైట్ వాష్ చేసిన భారత్.. తాజాగా ఆసీస్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈరోజు మూడో మ్యాచ్ జరగనుంది.

ఛేజింగ్‌లో కింగ్
ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 మ్యాచ్‌ల పరంగా చూస్తే అత్యధిక పరుగుల ఛేజింగ్‌లో టీమిండియానే టాప్-2 స్థానాలను ఆక్రమించింది. 2016లో ఆసీస్‌తో జరిగిన టీ20లో టీమిండియా 198 పరుగుల టార్గెటన్‌ను ఛేదించింది. మళ్లీ ఇప్పుడు 195 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియాపై వారి దేశంలోనే ఛేజ్ చేసింది. ఫలితంగా ఆసీస్‌పై ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డుల్లో తొలి రెండు స్థానాల్లో టీమిండియా నిలిచింది. అయితే ఈ రెండు మ్యాచ్‌లు సిడ్నీలో జరగడం మరొక విశేషం. టీమిండియా తర్వాత స్థానంలో శ్రీలంక ఉంది. 2017లో 174 పరుగుల టార్గెట్‌ను ఆసీస్‌పై వారి దేశంలో ఛేజ్ చేశారు లంకేయులు.
అది విరాట్ కోహ్లీకి అలవాటైపోయింది.. పాపం సంజూ శాంసన్.. జట్టులో ఉంటాడో లేదో!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications