
ఆస్ట్రేలియాలోనే ఉండండి:
గత మంగళవారం టీ20 సిరీస్ ముగిసింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, మణికట్టు స్పిన్నర్ యుజ్వేందర్ చహల్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ దీపక్ చహర్ తదితరులు భారత్‌కి బయల్దేరి వచ్చేశారు. అయితే ఫాస్ట్ బౌలర్లు శార్ధూల్ ఠాకూర్, టీ నటరాజన్.. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మాత్రం అక్కడే ఉన్నారు. టెస్ట్ సిరీస్ కోసం ప్రాక్టీస్ సెషన్స్‌లో బౌలింగ్ చేసేందుకు ముగ్గురిని బీసీసీఐ ఉంచిందా లేదా టెస్టుల్లో వీరికి అవకాశం ఇవ్వనుందా అనే విషయం తెలియరాలేదు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో ఈ ముగ్గురు రాణించిన విషయం తెలిసిందే.

నటరాజన్ అరంగేట్రం:
ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నటరాజన్.. ఇప్పటి వరకూ టెస్టుల్లో ఆడలేదు. తాజాగా ఆడిన వన్డే, టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. వాషింగ్టన్ సుందర్ టీ20ల్లో ఆడినా.. సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం ఇంకా ఆడలేదు. శార్ధూల్ ఠాకూర్ మాత్రం 2018లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో ఆడాడు కానీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. డిసెంబరు 17 నుంచి జనవరి 19 వరకూ టెస్టు సిరీస్ జరగనుంది. డిసెంబరు 17 నుంచి 21 వరకూ మొదటి టెస్టు జరగనుండగా.. ఆ తర్వాత డిసెంబరు 26 నుంచి 30 వరకూ రెండో టెస్టు జరగనుంది.

చెత్త గేమ్ ప్లే:
విమాన ప్రయాణంలో శిఖర్ ధావన్ తన సహచరులైన దీపక్ చహర్, యజ్వేంద్ర చహల్‌లతో కలిసి సరదాగా ఫోటో దిగాడు. దానిని ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి 'కళ్లలోని గుడ్లు పీకేసి గోలీలాట ఆడుతాం' అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్టుపై ఓ నెటిజన్ వ్యంగంగా స్పందించాడు. 'ఈ వేషాలకు ఏం తక్కువ లేదు..పేడ మొహాలు,చెత్త గేమ్ ప్లే' అంటూ కామెంట్ చేశాడు.నెటిజన్ కామెంట్‌పై గబ్బర్ స్పందించాడు. 'అవును .. మీ ఇంట్లో నీ గురించి కూడా ఇదే అనుకుంటున్నారా' అని ధీటుగా బదులిచ్చాడు. ప్రస్తుతం గబ్బర్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications

పుట్టినరోజు వేడుకలకు యువరాజ్ దూరం.. విషయం తెలిస్తే!!










