Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇది కలా.. నిజమా.. అస్సలు నమ్మలేకపోతున్నా: నటరాజన్‌

India vs Australia: T Natarajan says The Last Few Months Have Been Surreal
T Natarajan's Heartfelt Message 'A Dream Come True Moment' | India vs Australia

సిడ్నీ: గత కొన్ని నెలలుగా తన జీవితంలో జరిగిన విషయాల్ని అస్సలు నమ్మలేకపోతున్నాని టీమిండియా యువ సెన్సేషన్ టీ నటరాజన్‌ అన్నాడు. ఇదంతా కలా, నిజామా తెలుసుకోని అయోమయ స్థితిలో ఉన్నానని తెలిపాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఓడినా 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ గెలుపులో నటరాజన్ కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిపిస్తుంది. టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణమని, మరో బుమ్రా అని మాజీ క్రికెటర్లు, అభిమానులు కొనియాడుతున్నారు. ఇక సిరీస్ విజయానంతరం నటరాజన్.. తనపై చూపిన అభిమానానికి మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఫస్ట్ టూర్‌లోనే..

‘గత కొన్ని నెలల్లో జరిగిన విషయాలు నమ్మలేకపోతున్నా. ఇదంతా జరిగిందా అనిపిస్తుంది. నా తొలి పర్యటనలో టీ20 సిరీస్‌ విజయం సాధించడం గొప్పగా ఉంది. నా కల నిజమైన క్షణాన్ని మా జట్టు మరింత ప్రత్యేకంగా మార్చింది. అండగా నిలుస్తూ ప్రోత్సహించిన సహచరులకు కృతజ్ఞతలు. నాపై చూపిన అభిమానానికి, మద్దతుకు ధన్యవాదాలు'' అని నటరాజన్ ట్వీట్ చేశాడు. తనదైన యార్కర్లు, ఆఫ్ కట్లర్లు, పరిస్థితులకు తగ్గ స్లోయర్ బాల్స్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు.

 అనూహ్య అవకాశంతో..

అనూహ్య అవకాశంతో..

తొలుత నెట్ బౌలర్‌గా ఎంపికైన నటరాజన్‌కు వరుణ్ చక్రవర్తి గాయంతో టీ20ల్లో అవకాశం దక్కింది. ఆ తర్వాత సైనీ ఇంజ్యూరీతో వన్డేల్లో చోటు దొరికింది.

ఇక ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న నటరాజన్.. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి 2-0తో సిరీస్‌ కోల్పోయిన జట్టుకు ఉపశమన విజయాన్నందించాడు. ఈ సూపర్ ఫెర్ఫామెన్స్‌తో టీ20ల్లోకి కూడా అరంగేట్రం చేసి మరో బుమ్రాలా చెలరేగాడు.

 సూపర్ పెర్ఫామెన్స్..

సూపర్ పెర్ఫామెన్స్..

తొలి టీ20లో 4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసిన నట్టూ.. రెండో టీ20లో భారత బౌలర్లంతా విఫలమైన వేళ పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. మంగళవారం జరిగిన ఆఖరి టీ20లోనూ నట్టూ ఆకట్టుకున్నాడు. జోరు మీదున్న గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేసి భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేశాడు. మాథ్యూ వేడ్‌‌ను ఔట్ చేసినప్పటికీ అంపైర్ల తప్పిదంతో అది ఖాతాలోకి రాలేదు. ఇక నట్టూ అంతర్జాతీయ అరంగేట్రం అచ్చం బుమ్రాలానే ఉండటం విశేషం.

 కెప్టెన్ ప్రశంసలు..

కెప్టెన్ ప్రశంసలు..

నటరాజన్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కొనియాడారు. ఒత్తిడిలోనూ నట్టూ సత్తా చాటాడని, వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ముంగిట అతడు భారత్‌కు దొరికిన విలువైన బౌలర్‌ అని కోహ్లీ కితాబిచ్చాడు. మరోవైపు హార్దిక్‌.. తనకి దక్కిన 'మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌'ను నటరాజన్‌కు అందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో కెరీర్‌ ఆరంభ మ్యాచ్‌ల్లోనే గొప్పగా బౌలింగ్ చేసిన అతడికి ఈ అవార్డు దక్కాలని, అతనే అర్హుడని పేర్కొన్నాడు.

Story first published: Wednesday, December 9, 2020, 15:42 [IST]
Other articles published on Dec 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+