Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: 'జట్టులో నా పేరు ఎందుకు లేదని గదిలోనే కూర్చున్నా.. ఒక్కసారిగా ఏడ్చేశా'

India vs Australia: Suryakumar Yadav reveals Rohit Sharma helped him come out of the disappointment

ముంబై: ఐపీఎల్ 2020‌లో అద్భుతంగా రాణించినా ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై జోరుగా చర్చలు సాగిన సంగతి తెలిసిందే. బీసీసీఐ సెలక్టర్లపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కూడా సూర్యకుమార్‌కు ప్రత్యేక మాసేజ్ పంపారు. ఓపికతో ఉండాలని, భారత జట్టులో ఆడే అవకాశం తప్పక వస్తుందని దైర్యం చెప్పారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడంపై ఎంతో భావోద్వేగానికి గురైనట్టు తాజాగా సూర్యకుమార్‌ తెలిపాడు. భారత జట్టును ప్రకటించిన రోజు బాధతో గదిలోనే కూర్చుని ఏడ్చేశానని చెప్పాడు.

ఎంతో నిరాశకు గురయ్యా:

ఎంతో నిరాశకు గురయ్యా:

సూర్యకుమార్‌ యాదవ్ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'జిమ్‌లో రోహిత్‌ శర్మ పక్కన కూర్చుని నన్ను చూస్తున్నాడు. జట్టుకు ఎంపికపై శుభవార్తతో ఉన్నానని అనుకున్నాడు. నేను ఎంతో నిరాశకు గురయ్యా అని రోహిత్‌తో చెప్పాను. తర్వాత రోహిత్ న వద్దకు వచ్చి మాట్లాడాడు. ఎంపిక కాకపోవడం గురించి ఆలోచించకుండా జట్టు కోసం నువ్వు గొప్పగా పోరాడతావని నమ్ముతున్నా. ఐపీఎల్‌లో తొలి రోజు నుంచి ఎలా ఆడతున్నావో అలానే ప్రయత్నించు అని చెప్పాడు' అని తెలిపాడు.

రోహిత్ ధైర్యం చెప్పాడు:

రోహిత్ ధైర్యం చెప్పాడు:

'సరైన సమయంలో నీకు కచ్చితంగా అవకాశం వస్తుంది. అది ఈ రోజు లేదా రేపు కావొచ్చు. ఆత్మవిశ్వాసంతో ఆటను కొనసాగించు అని రోహిత్ నాతో అన్నాడు. ఆ క్షణంలో రోహిత్ మాటలు నాకు ఎంతో దోహదం చేశాయి. జట్టు ఎంపిక ఆలోచన నుంచి బయటికి వచ్చేలా చేశాయి. నా కళ్లలోని బాధను అతడు స్పష్టంగా చూశాడు' అని సూర్యకుమార్‌ యాదవ్ పేర్కొన్నాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ పదమూడో సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్‌.. 40 సగటుతో 480 పరుగులు చేశాడు. ముంబై అయిదో సారి టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

 జట్టులో నా పేరు ఎందుకు లేదు:

జట్టులో నా పేరు ఎందుకు లేదు:

'జట్టును ప్రకటిస్తారని తెలియడంతో ఆ రోజు బిజీగా ఉండటానికి ప్రయత్నించా. ఎంపిక చేసిన జట్టును రాత్రి వెల్లడిస్తారనే ఆలోచనను నాలో నుంచి తొలగించడానికి ప్రయత్నించా. నా పనులపై దృష్టి సారించా. జిమ్‌లో ఉండటం, జట్టు సభ్యులతో మాట్లాడడం చేశా. కానీ నా మదిలో అదే ఆలోచన. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ప్రకటించారు. తర్వాత గదిలోకి వెళ్లి కూర్చున్నా. ఆలోచించడం ప్రారంభించా. జట్టులో నా పేరు ఎందుకు లేదని ఏడ్చేశా. అయితే ఎంపికైన ఆటగాళ్లు ఐపీఎల్‌, భారత్ తరఫున రాణిస్తున్నవారే. దీంతో ఆటపై దృష్టిసారిస్తూ మరిన్ని పరుగులు సాధిస్తూ జట్టులో చోటు కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నా. మంచి ప్రదర్శనలు చేస్తూ అవకాశం కోసం ఎదురుచూడాలని భావించా' అని సూర్యకుమార్ వెల్లడించాడు.

ఆ మ‌రుస‌టి రోజే:

ఆ మ‌రుస‌టి రోజే:

డొమెస్టిక్ క్రికెట్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న సూర్య‌కుమార్‌ యాదవ్‌కు బీసీసీఐ సెల‌క్ట‌ర్లు మొండిచేయి చూపించారు. అతడిని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికచేయలేదు. ఆ మ‌రుస‌టి రోజే బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబైని ఒంటిచేత్తో గెలిపించిన సూర్య‌కుమార్‌.. సెల‌క్ట‌ర్ల‌కు బ్యాట్‌తో స‌మాధాన‌మిచ్చాడు. ముంబై 165 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగగా సూర్య (79 నాటౌట్‌; 43 బంతుల్లో 10x4, 3x6) కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఆ జట్టును గెలిపించాడు. అత‌ని జోరు చూసిన విరాట్ కోహ్లీ.. ఇన్నింగ్స్ మ‌ధ్య‌లో అత‌ని ఏకాగ్ర‌త‌ను చెద‌ర‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నించాడు. స్లెడ్జింగ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. సూర్య‌ మాత్రం మారు మాట్లాడ‌కుండా కోహ్లీని అలా కోపంగా చూస్తూ ఉండిపోయాడు.

ఎంజులో అద్భుతం.. మూడు నిమిషాల్లో రెండు గోల్స్‌.. మ్యాచ్‌ మలుపు!!

Story first published: Monday, November 23, 2020, 18:36 [IST]
Other articles published on Nov 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+