For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పుకోవిస్కి బీ కేర్‌ ఫుల్‌.. మా బౌలర్లు నీ బలహీనతతో ఆడుకుంటారు: సునీల్ గవాస్కర్

India vs Australia: Sunil Gavaskar Warns Concussion-Victim Will Pucovski about Indian bowlers

సిడ్నీ : ఆస్ట్రేలియా యువ ఆటగాడు విల్ పుకోవిస్కీని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హెచ్చరించాడు. భారత బౌలర్లతో జాగ్రత్తగా ఉండాలని లేకుంటే బలహీనతతో ఆడుకుంటారని తెలిపాడు. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ నేపథ్యంలో ఆసీస్ దేశవాళీ క్రికెట్‌లో రాణించిన విల్‌ పుకోవిస్కిపై భారీ అంచనాలున్నాయి. డేవిడ్‌ వార్నర్‌ గైర్హాజరీలో పుకోవిస్కి రాణిస్తాడని ఆ జట్టు మేనేజ్‌మెంట్ కూడా ఆశలు పెట్టుకుంది. కానీ అనూహ్యంగా టీమిండియాతో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో యువ పేసర్ కార్తిక్‌ త్యాగి వేసిన బౌన్సర్‌ విల్‌ పుకోవిస్కి తలకు బలంగా తాకింది. దాంతో అతను ఫస్ట్ టెస్ట్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం పుకోవిస్కీ గాయం తీవ్రమైనది కాదని, డిసెంబర్‌ 17 నుంచి ఆరంభం కానున్న మొదటి టెస్టుకు అందుబాటులో ఉంటాడని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో సునీల్‌ గవాస్కర్‌ పుకోవిస్కికి పలు సూచనలు చేశాడు. 'బౌన్సర్లకు బ్యాట్స్‌మెన్ గాయపడతారని ముందే ఊహించా. సాధారణంగానే ఆసీస్‌ పిచ్‌లు పేసర్లకు స్వర్గధామంగా ఉంటాయి. బ్యాట్స్‌మెన్‌ మైదానంలోకి దిగాడంటే.. దేశం, రాష్ట్రం, క్లబ్‌.. ఇలా దేనికి ప్రాతినిధ్యం వహించినా బౌన్సర్లు ఆడాల్సిందే. రానున్న టెస్టు సిరీస్‌లో పుకోవిస్కి ఆడితే ఇలాంటి బౌన్సర్లు మరిన్ని రానున్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు అతను సిద్ధంగా ఉండాలి. పైగా అతనికి కంకషన్ హిస్టరీ ఉంది కాబట్టి భారత్ షార్ట్ పిచ్ బంతులతో అతనిపై దాడి చేయవచ్చు. నాకు తెలిసి టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమీ బౌన్సర్లు వేయడంలో దిట్ట.. అతని నుంచి మంచి బౌన్సర్లను ఇదివరకే చూశా'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

ఇక భారత ఆటగాడికి ఎవరికైనా ఇదే తరహా వీక్‌నెస్ ఉంటే.. ఆస్ట్రేలియా కూడా అదే పని చేస్తుందని గవాస్కర్ తెలిపాడు. ఇర షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన విల్.. ఎలాంటి బంతులనైనా ఎదుర్కొంటాడని ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

Story first published: Friday, December 11, 2020, 18:21 [IST]
Other articles published on Dec 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+