రోహిత్ శర్మకు అతనే సరైన జోడీ: సునీల్ గవాస్కర్

న్యూఢిల్లీ: క్వారంటైన్‌ను పూర్తి చేసుకోని జట్టుతో చేరిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు సిడ్నీ టెస్ట్‌లో అవకాశం కల్పించాలని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో భారత్ సమం చేసినా.. ఓపెనింగ్ సమస్య వెంటాడుతుందని, దాన్ని అధిగమించాలంటే రోహిత్ శర్మకు జతగా మయాంక్ అగర్వాల్‌ను బరిలోకి దించాలని లిటిల్ మాస్టర్ సూచించాడు. రోహిత్‌కు మయాంకే సరైన జోడని సోనీ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. రెండు టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమైన మయాంక్‌కు మరో అవకాశం ఇవ్వాలన్నాడు.

మయాంక్‌కు మరో చాన్స్..
గత ఏడాదిన్నరగా మయాంక్ అగర్వాల్ అద్భుతంగా ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. అయితే ఇది కఠిన సమయం. ఆస్ట్రేలియా పిచ్‌లపై ప్రతి బ్యాట్స్‌మన్ ఇబ్బందిపడతాడు. మయాంక్‌కు మరో అవకాశం ఇవ్వాలి. రోహిత్-మయాంక్ ఓపెనర్లుగా బరిలోకి దిగాలి. అయితే మయాంక్ తన ఆటతీరును కాస్త మెరుగుపర్చుకోవాలి. ఒకానొక సందర్భంలో అతను టెస్టుల్లో భారత్ తరఫున వేగంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచేలా దూసుకెళ్లాడు. కానీ గొప్ప పేసర్ల కారణంగా ఆ ఘనతను సాధించలేకపోయాడు'అని గవాస్కర్ పేర్కొన్నాడు.

సెలెక్షన్ తలనొప్పి..
ఇక మయాంక్.. టెస్టుల్లో భారత్ తరఫున వేగంగా వెయ్యి పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో వినోద్ కాంబ్లి, పుజారా ఉన్నారు. అయితే టీమిండియాకు ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ కూడా అందుబాటులో ఉన్నారు. అరంగేట్రంలోనే గిల్ 45, 35 నాటౌట్ పరుగులతో సత్తాచాటిన విషయం తెలిసిందే. మరోవైపు సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్‌కు తొలి రెండు టెస్టుల్లో చోటు దక్కలేదు. రోహిత్ క్వారంటైన్‌ను ముగించుకుని నేడు జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలో ఓపెనర్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

మిడిలార్డర్‌లో శుభ్‌మన్..
అయితే సునీల్ గవాస్కర్ మాత్రం అరంగేట్ర టెస్ట్‌లో రాణించిన శుభ్‌మన్ గిల్‌ను మిడిలార్డ్‌ర్‌లో ఆడించాలన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అతను డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేసిన దాఖలాలు ఉన్నాయని గుర్తు చేశాడు. అతని బ్యాటింగ్ అప్రోచ్.. మిడిలార్డర్‌కు సరిపోతుందని, జట్టుకు కూడా మేలు జరుగుతుందన్నాడు. నంబర్ 5లో అతన్ని ఆడించాలన్నాడు. తొలి టెస్టులో పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడని రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. ఇప్పుడు రోహిత్ రాకతో తొలి రెండు టెస్ట్‌ల్లో విపలమైన మయాంక్‌పై వేటు పడనుంది. కానీ సునీల్ గవాస్కర్ మాత్రం అతని అవకాశం ఇవ్వమనడం కొసమెరుపు. అదే జరిగితే విహారీపై వేటు తప్పదు. రాహుల్ జట్టులోకి వస్తే మయాంక్ కూడా బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications