రహానే కెప్టెన్సీ ఔట్‌స్టాండింగ్... ఇలా చెప్పినా ట్రోలింగ్ చేస్తారు: సునీల్ గవాస్కర్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా తాత్కలిక కెప్టెన్ అజింక్యా రహానే జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడని దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. రహానే ఫీల్డ్ ప్లేస్‌మెంట్ చాలా బాగుందని కితాబిచ్చాడు. అయితే ఇలా చెప్పినా తనపై ట్రోలింగ్‌కు దిగుతారని, ముంబై ప్లేయర్ కాబట్టే ప్రశంసిస్తున్నాడని నిందలు వేస్తారన్నాడు. పెటర్నిటీ లీవ్ తీసుకున్న కెప్టన్ విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టి గవాస్కర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ట్రోలింగ్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ సూపర్..
‘రహానే కెప్టెన్సీపై అంత త్వరగా ఓ నిర్ణయానికి రావొద్దు. ఒకవేళ బాగుందని చెబితే లేనిపోని ఆరోపణలు చేస్తారు. కెప్టెన్సీ ఆరంభంలోనే ఉన్నాడు కాబట్టి ఆ విషయంలోకి నేను పోదల్చుకోలేదు. అయితే లుబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌కు ఫీల్డింగ్ మొహరించిన విధానం చాలా బాగుంది. అతను కెప్టెన్సీ చేసిన రెండు టెస్ట్‌లను, వన్డే మ్యాచ్ నేను చూశా. అప్పటికి, ఇప్పటికి చాలా తేడా ఉంది. చాలా తెలివిగా ఫీల్డర్లను పెడుతున్నాడు. ఫీల్డర్లకు అనుగుణంగా బౌలర్లు బౌలింగ్ చేయడం కూడా చాలా ప్రధానం. ఈ రోజు ఆటలో అది కనిపించింది.'అని సన్నీ పేర్కొన్నాడు. కీలక టైమ్‌లో బౌలింగ్ మార్పులు కూడా చాలా బాగా చేశాడన్నాడు. తొలి రోజు భారత్ సక్సెస్‌కు ప్రధాన కారణం బౌలర్లదేనని చెప్పాడు.

బెంచ్ బలం అద్భుతం..
‘ఫాస్ట్ బౌలర్లతో బెంచ్ బలంగా ఉండటం అద్భుతం. అసాధారణ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం నిజంగా నమ్మశక్యంకానీ విషయం. బెంచ్‌లో ఉన్న నవ్‌దీప్ సైనీ వేగవంతమైన పేసరే. 145 కిలీమీటర్ల ఖచ్చితమైన వేగంతో బంతులు విసిరగలడు. వార్మప్ గేమ్స్‌లో రాణించకపోవడంతోనే బాక్సింగ్ డే టెస్ట్‌లో చాన్స్ దక్కలేదనుకుంటున్నా. ఆ కారణంతోనే అతన్ని కాదని సిరాజ్‌కు అవకాశమిచ్చారు.
ఇంకా చాలా మంది పేసర్లు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇది భారత జట్టుకు మంచి పరిణామం. వారి ఫిట్‌నెస్ కూడా బాగుంది. జిమ్ వర్క్ అప్పర్ బాడీతో స్పష్టంగా తెలుస్తోంది. ప్రొఫెషనల్ మార్గనిర్దేశకంలో వారంతా రాటు దేలాడు. ఈ తరం ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై చాలా దృష్టిసారిస్తున్నారు.'అని సన్నీచెప్పుకొచ్చాడు.

రహానే సూపర్..
అడిలైడ్ ఘోరపరాజయాన్ని మరిచి రెండో టెస్ట్‌లో జట్టును అద్భుతంగా నడిపించిన రహానేపై మాజీ, సహచర ఆటగాళ్లు ప్రశంసల జల్లు కురిపించారు. 'బౌలింగ్‌లో మార్పులు, ఫీల్డర్లను మోహరించడంలో రహానే అద్భుతంగా పనిచేశాడు. బౌలర్లు అశ్విన్, బుమ్రా, సిరాజ్ అదరగొట్టారు. తెలివిగా బంతులు వేశారు. తొలి రోజు ఆస్ట్రేలియాను 195 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడం బ్యాట్స్‌మెన్ చేతుల్లో ఉంది' అని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడగా... ‘మొదటి రోజు ఆట మాదే. బౌలర్లు గొప్ప ప్రదర్శన చేశారు. మంచి ముగింపు లభించింది'అని కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు.

రహానే ఎత్తులు ఫలించాయి..
‘టీమిండియాదే తొలి రోజు. బౌలర్లు మరోసారి సంచలన ప్రదర్శన చేశారు. అరంగేట్ర మ్యాచ్‌లో సిరాజ్, గిల్ ఆత్మవిశ్వాసంతో ఆడారు. సారథిగా రహానె సత్తాచాటాడు. అడిలైడ్ టెస్టులోని లోపాలను పునరావృతం చేయలేదు' అని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేయగా.. 'తొలి రోజు ఆట గొప్పగా సాగింది. మెల్‌బోర్న్ మైదాన సిబ్బందికి శుభాకాంక్షలు. ఎంతోకాలం తర్వాత మంచి పిచ్‌ను సిద్ధంచేశారు.
ఇలాంటి పిచ్‌లు మరిన్ని చేయాలి. ఇక భారత బౌలర్లు చక్కని ప్రదర్శన కనబరిచారు. జట్టును రహానే గొప్పగా ముందుకు నడిపించాడు. ఆదివారం మొత్తం టీమిండియా బ్యాటింగ్ చేయగలదా?' షేన్ వార్న్ సందేహం వెలిబుచ్చాడు. ఆదిలోనే అశ్విన్‌కు బంతిని అందించడం, రెండో సెషన్‌లో సిరాజ్‌తో బౌలింగ్ చేయించిన రహానే నిర్ణయాలు ఆసక్తికరంగా ఉన్నాయని, అతని ఎత్తులు ఫలించాయని ఆకాశ్ చోప్రా కొనియాడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications