క్రిస్మస్‌కు ఇంకా టైముంది.. అప్పుడే గిఫ్ట్‌లు ఇవ్వకండి.. టీమిండియా చెత్త ఫీల్డింగ్‌పై గవాస్కర్ సెటైర్స్!

అడిలైడ్: భారత్-ఆస్ట్రేలియా డే/నైట్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. బ్యాటింగ్‌లో కొంత తడబడిన కోహ్లీ సేన.. బౌలింగ్‌లో ఆతిథ్య జట్టును ముప్పు తిప్పలు పెడుతుంది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకున్న భారత బౌలర్లు ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. దాంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 65 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా బౌలర్ల ధాటికి ఓపెనర్లు మాథ్యూ వేడ్(8) జో బర్న్స్(8), స్టీవ్ స్మిత్(1), ట్రావిస్ హెడ్(7) నిలబడలేకపోయారు.

మూడు క్యాచ్‌లు డ్రాప్
అయితే బౌలింగ్‌లో రఫ్ఫాడిస్తున్న కోహ్లీ సేన.. చెత్త ఫీల్డింగ్‌తో తీవ్రంగా నిరాశపరిచింది. పదే పదే ఆసీస్ ఆటగాళ్లు ఇచ్చిన సులువైన క్యాచ్‌లను నేలపాలు చేసింది. ముఖ్యంగా మార్నస్ లబుషేన్ ఒక్కడికే మూడు అవకాశాలిచ్చింది. సున్నా వద్ద బుమ్రా బౌలింగ్‌లో లబుషేన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ సాహా వదిలేయగా.. 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షమీ బౌలింగ్‌లో ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బుమ్రా నేలపాలు చేశాడు. హై క్యాచ్‌గా పొరబడిన బుమ్రా.. బౌండరీ లైన్ వద్ద అవసరం లేకున్నా గాల్లోకి ఎగిరి మంచి అవకాశాన్ని చేజార్చాడు. అనంతరం 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బుమ్రా బౌలింగ్‌లో లబుషేన్ ఇచ్చిన మరో క్యాచ్‌ను పృథ్వీషా చేజార్చాడు. ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న లబుషేన్(42 బ్యాటింగ్) క్రీజులో కుదురుకొని హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.
క్రిస్మస్ మూడ్‌లో..
ఇక భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. భారత ప్లేయర్లు క్రిస్మస్ మూడ్‌లో ఉన్నారని, తమ ప్రత్యర్థి క్యాచ్‌లు నేలపాలు చేస్తూ.. పండుగ గిఫ్ట్‌లు ఇస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘భారత ఫీల్డర్లు క్రిస్మస్ మూడ్‌లో ఉన్నట్టున్నారు. వారం ముందుగానే క్రిస్మస్ బహుమతులు ఇచ్చేస్తున్నారు.'అని సెటైర్లు పేల్చారు. క్యాచ్‌లు చేజార్చడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మైదానంలో చాలా చికాకు గురైనట్లు కనిపించాడు.
ఫీల్డింగ్ కోచ్ ఎవడ్రా..?
ఇక భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్‌పై అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు భారత ఫీల్డింగ్ కోచ్ ఎవడ్రా..? అని ప్రశ్నిస్తున్నారు. ఈ టూర్‌లో టీమిండియా ఫీల్డింగ్ మరి అధ్వాన్నంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. వెంటనే ఫీల్డింగ్ కోచ్‌ను మార్చాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌కు సూచిస్తున్నారు. ఇక ఆటగాళ్లు కూడా మైదానంలో మబ్బును వీడాలని, ఇలా అయితే బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా కష్టమేనని ట్వీట్ చేస్తున్నారు.
కష్టాల్లో ఆసీస్..
భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు మాథ్యూ వేడ్(8), జో బర్న్స్(8)లను బుమ్రా పెవిలియన్ చేర్చగా.. కీలక స్టీవ్ స్మిత్(1) వికెట్‌తో పాటు ట్రావిస్ హెడ్(7), కామెరూన్ గ్రీన్(11)లను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులో లబుషేన్(42 బ్యాటింగ్), కెప్టెన్ టిమ్ పైన్ (0 బ్యాటింగ్) ఉన్నారు. అశ్విన్ మూడు వికెట్లుతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications