'పితృత్వ సెలవులు అడగలేదు.. టీమిండియా కోసం ఆడటానికే కట్టుబడి ఉన్నా'

ముంబై: ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్‌కు తిరిగి రానున్న సంగతి తెలిసిందే. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుండటంతో.. బీసీసీఐ భారత సారథికి పితృత్వ సెలవులు మంజూరు చేసింది. అయితే బీసీసీఐ బోర్డు విరాట్‌కు ఇలా అనుమతివ్వడం ఓ ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇప్పుడైతే ఇలా అడగ్గానే సెలవులు ఇస్తున్నారు గానీ.. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని మాజీలు కొందరు అన్నారు. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పితృత్వ సెలవు అడిగినా.. బీసీసీఐ ఇవ్వలేదు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

గవాస్కర్ క్లారిటీ:
1975-76 సమయంలో కీలకమైన వెస్టిండీస్ టూర్ కోసం భారత క్రికెట్ జట్టు సిద్ధమవుతోంది. ఆ సమయంలో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్న తన భార్య దగ్గరకు వెళ్లడానికి సునీల్ గవాస్కర్ అనుమతి అడిగాడని, అయినా బీసీసీఐ బోర్డు మాత్రం అందుకు అనుమతించలేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై గవాస్కర్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలో కొంత నిజం ఉంది కానీ తాను పితృత్వ సెలవు అడగటం మాత్రం నిజం కాదని సన్నీ స్పష్టం చేశాడు.

పితృత్వ సెలవులు అడగలేదు:
తాజాగా ఓ జాతీయ మీడియాతో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'ఈ వార్తలో కొంత నిజం ఉంది కానీ నేను పితృత్వ సెలవులు అడగటం మాత్రం నిజం కాదు. నేను న్యూజిలాండ్, వెస్టిండీస్ పర్యటనల కోసం బయలుదేరినప్పుడు నా భార్య ఏ సమయంలో అయినా బిడ్డకు జన్మనివ్వనుందన్న విషయం నాకు తెలుసు. అయినా నేను టీమ్‌కు ఆడటానికే ప్రాధాన్యం ఇచ్చాను. ఈ విషయంలో నాకు నా భార్య కూడా మద్దతుగా నిలిచింది' అని చెప్పాడు.

అందుకు ఒప్పుకోలేదు:
'న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌లో నేను గాయపడ్డాడు. నాలుగు వారాల విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పారు. వెస్టిండీస్ టూర్‌కు మధ్యలో మూడు వారాల సమయం ఉండటంతో ఆ లోపు ఇండియాకు వెళ్లి, తొలి టెస్ట్‌కు ముందే నేరుగా విండీస్‌లో టీమ్‌తో చేరతా అని బోర్డును అడిగా' సన్నీ చెప్పాడు. అయితే అప్పటి టీమ్ మేనేజర్ పాలీ ఉమ్రిగర్ అందుకు ఒప్పుకోలేదని, దీంతో తాను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా తొలి టెస్ట్‌లో ఆడినట్లు గవాస్కర్ తెలిపాడు. గవాస్కర్ టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. 34 సెంచరీలతో 10122 రన్స్ చేశాడు.

కోహ్లీ లేకున్నా పర్వాలేదు:
ఇటీవల సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'మనం ఓసారి గణాంకాలను పరిశీలిస్తే.. విరాట్ కోహ్లీ ఆడని ప్రతీ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ధర్మశాలలో ఆస్ట్రేలియాపై, అఫ్గానిస్థాన్ మీద ఒక టెస్టు. నిదహాస్ ట్రోఫీ, 2018 ఆసియా కప్ ఇలా ఎప్పుడు చూసినా.. కోహ్లీ లేని మ్యాచ్‌ల్లో భరత్ గెలుపొందింది. కోహ్లీ లేనప్పుడు ఇతర ఆటగాళ్లు బాగా ఆడడానికి ప్రయత్నిస్తారు. అతడు లేని లోటును భర్తీ చేయాలని అర్థం చేసుకుంటారు. అందుకే టీమిండియా రాణిస్తోంది' అని చెప్పుకొచ్చాడు.
'విరాట్ కోహ్లీ లేకుండా గెలిస్తే.. టీమిండియాకు ఏడాదంతా సంబరాలే'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications